ఒకపక్క వైయస్ జగన్ ప్రతిపక్ష నాయకులకు వీలైనన్ని అడ్డంకులను సృష్టిస్తుంటే మరొకపక్క పవన్ దూకుడుగా వ్యవహరిస్తున్నాడు.తన అధికార ప్రచార వాహనం వారాహికి ప్రత్యేక పూజలు చేయించేందుకు పవన్ కొండగట్టు ఆలయాన్ని ఎంచుకున్న విషయం తెలిసిందే.
ఒకపక్క ఆంధ్రప్రదేశ్లో జీ.ఓ 1 ఇంకా పూర్తిగా రద్దు కాలేదు.సుప్రీంకోర్టులో ఇకపై విచారణ జరుగుతుంది.హైకోర్టు వారు ప్రతిపక్షాలకు మద్దతుగా ఉన్నా అధికార పార్టీ ఎన్నడూ లేని విధంగా సుప్రీంకోర్టుకు వెళ్లి విషయం తేల్చుకోవాలని చూస్తోంది.

అయితే ఇలాంటి సమయంలో పవన్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుని మరీ వారాహిని ఆంధ్రప్రదేశ్ లోకి తీసుకెళ్లడం పలు అవాంఛిత చర్యలకు దారితీస్తుందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు.సుప్రీంకోర్టు కూడా జీ.ఓ 1 విషయం గురించి స్పష్టం చేసిన తర్వాత దర్జాగా వారాహిని ఏపీలో తీసుకుని వెళ్లాల్సిందని అంటున్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రచార వాహనం వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
జగిత్యాలలోని కొండగట్టుకు బయల్దేరిన పవన్ అక్కడ ఆంజనేయుడి ఆశీస్సులు తీసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.పవన్ కాన్వాయ్‌తో పాటు పలువురు జనసేన నేతలు, పవన్ అనుచరులు కొండగట్టుకు చేరుకున్నారు.
ఉదయం 11 గంటలకు పవన్ కొండగట్టు ఆలయానికి చేరుకుంటారు.

పవన్‌కు అధికారికంగా స్వాగతం పలకాలని ఆలయ అధికారులకు సమాచారం అందింది.పూజారులు వారాహికి పూజలు నిర్వహించి వాహనాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.ఆ తర్వాత కరీంనగర్‌లోని కొడిమియాల్ మండలం నాచుపల్లిలోని ఓ రిసార్ట్‌లో తెలంగాణ కీలక నేతలతో పవన్ భేటీ కానున్నారు.
అక్కడి నుంచి ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించనున్న పవన్ అక్కడ నరసింహ అనుష్టుప్ యాత్రను ప్రారంభిస్తారు.ఈ యాత్రలో భాగంగా పవన్ మొత్తం 31 నారసింహ క్షేత్రాలను సందర్శిస్తారు.
ధర్మపురిలో పూజా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన అనంతరం పవన్ హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.కొండగట్టు, ధర్మపురిలో పవన్ పర్యటన నేపథ్యంలో అభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
కొండగట్టు, ధర్మపురి ఆలయాల దగ్గర పోలీసు అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.కొండగట్టులో పవన్‌ను కలిసేందుకు కొందరు అభిమానులు ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి చేరుకున్నారు.