సావిత్రిని కాదని మరొక హీరోయిన్ తో ఎన్టీయార్ సినిమా.. ఆమె చేసిన తప్పేంటి ?

ఎన్టీఆర్, సావిత్రి కలిసి ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు.వీరిద్దరి సినిమా వస్తుందంటే చాలు అది సూపర్ డూపర్ హిట్ అయినట్టే.

 Why Ntr Said No To Savitri In Thirupathamma Katha Movie Details, Nandamuri Tarak-TeluguStop.com

ఎన్టీఆర్ సావిత్రి నటించిన సినిమా విడుదలవుతుంది అంటే అభిమానులు ఎంతో దూరాల నుంచి కూడా వచ్చి సినిమా చూసేందుకు ఆసక్తి చూపేవారు.నాటి రోజుల్లో అయితే ఇలా ఆన్లైన్ లేదు కాబట్టి ఎక్కడ సినిమా నడిచిన సరే ఎడ్ల బండి కట్టుకొని మరీ వచ్చి సినిమా హాల్లో ముందు లైన్ లో నిలబడి టికెట్ సంపాదించుకునేవారు.

అంతలా ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్ కి ఒక క్రేజ్ ఉండేది.

కేవలం కుర్రాళ్ళు మాత్రమే కాదు, మధ్య వయస్కులు, ఏకంగా వృద్ధులు కూడా ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే చాలు ఫస్ట్ షో సినిమా చూడ్డానికి థియేటర్ కి పరుగులు పెట్టేవారు.

ఉదయం 6 గంటల నుంచి క్యూలో నిలబడి టికెట్ కోసం ఎదురు చూసేవారు.సావిత్రి, ఎన్టీఆర్ కాంబినేషన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు.ఏకంగా 200 రోజులు ఆడుతుంది అనే గ్యారెంటీ ఉండేది.అప్పట్లో నిర్మాతలు కూడా ఇదే నమ్మకంతో వీరి కాంబినేషన్లో అనేక సినిమాల్లో తీశారు.

ఏకంగా పదుల సంఖ్యలో వీరు సినిమాలు తీశారు అంటే ఆశ్చర్యం కలగక మానదు.

కానీ ఒకానొక టైంలో సావిత్రిని తన సినిమాలో వద్దు అనుకున్నారట ఎన్టీఆర్.

Telugu Krishna Kumari, Savitri, Nandamuritaraka, Ntr Fans, Ntr Savitri, Savitr-M

అందరూ సావిత్రిని సావిత్రి అని పిలిస్తే కేవలం ఎన్టీఆర్ మాత్రమే సావిత్రమ్మ అని గౌరవంగా పిలిచేవారట.లేదంటే నటుడు నాగయ్య గారిలా పెద్దమ్మాయి అంటూ ఇంటి సభ్యురాలిలాగా పిలిచేవారట.ఇక ఎన్టీయార్ కి తిరుపతమ్మ కథ పై ఒక సినిమా తీయాలని ఎన్టీఆర్ భావించగా నిర్మాతగా కూడా ఆయనే వ్యవహరించలనుకున్నారు.కృష్ణా జిల్లాకు చెందిన తిరుపతమ్మ దేవాలయం అంటే ఎన్టీఆర్ గారికి తీరని మక్కువ.

ఆయన సీఎం అయ్యాక కూడా తొలిసారి ఆ ఆలయానికి వెళ్లి పూజలు చేయించుకున్నారు.

Telugu Krishna Kumari, Savitri, Nandamuritaraka, Ntr Fans, Ntr Savitri, Savitr-M

కథ సిద్ధం అయ్యాక నిర్మాత కూడా మారిపోయాడు.ఇక ఈ సినిమాలో సావిత్రిని కాదని కృష్ణకుమారిని హీరోయిన్ గా పెట్టారు ఎన్టీఆర్.ఇది ఎందుకు, ఎలా జరిగిందో తెలియదు కానీ ఇప్పటివరకు ఈ విషయంపై స్పష్టత లేదు.

అప్పటికే మద్యానికి సావిత్రి బానిస కావడమే దీనికి కారణం కావచ్చు.ఎందుకంటే తిరుపతమ్మ పాత్ర ఎంతో పవిత్రమైనది.

ఆయన పౌరాణిక సినిమాలు చేసేటప్పుడు మద్యం, మాంసాహారం తినేవారు కాదు.అదే మడి, ఆచారం అందరూ భావించాలని ఎన్టీయార్ కోరుకునేవారు.

అందుకే సావిత్రిని కాదని కృష్ణకుమారిని తీసుకొని ఉంటారని అంతా భావించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube