బాలయ్య కోసం ఫస్టాఫ్ రెడీ..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా తర్వాత అనీల్ రావిపుడి డైరక్షన్ లో బాలకృష్ణ సినిమా వస్తుంది.

 First Half Ready For Balakrishna Anil Ravipudi Direction Details, Anil Ravipudi-TeluguStop.com

అనీల్ రావిపుడి బాలయ్య కోసం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు.ప్రస్తుతం వైజాగ్ లో స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న అనీల్ రావిపుడి సినిమాకు సంబందించిన ఫస్ట్ హాఫ్ మొత్తం పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

ఫస్ట్ హాఫ్ పూర్తి చేసి బాలయ్య బాబుకి వినిపించారట.

పటాస్ నుంచి F3 వరకు వరుస హిట్లతో దూసుకెళ్తున్న అనీల్ రావిపుడి బాలయ్యతో తీస్తున్న సినిమాతో మాత్రం యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు.

ఆడియెన్స్ పల్స్ తెలిసిన అనీల్ రావిపుడి బాలయ్య ని ఎలా చూపిస్తే ప్రేక్షకులు మెచ్చుతారో అతనికి తెలుసు.అందుకే బాలయ్య కోసం అదిరిపోయే స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట.

బాలకృష్ణ మార్క్ యాక్షన్ సీన్స్ ఉన్నా తన మార్క్ ఎంటర్టైనింగ్ కూడా ఉంటుందని చెబుతున్నాడు.ఈ సినిమా గురించి మిగతా డీటైల్స్ అన్ని త్వరలో బయటకు వస్తాయి.గోపీచంద్ సినిమా పూర్తి కాగానే అనీల్ మూవీ సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు బాలయ్య బాబు. 2023 సమ్మర్ టార్గెట్ తో ఈ మూవీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube