నందమూరి తారక రామారావు అంటేనే సహాయానికి మారు పేరు.ఆయన చేతికి ఎముక ఉండదు అంటూ ఉంటారు.
కానీ గిట్టని వాళ్ళు మాత్రం ఎన్టీఆర్ పిల్లికి( Sr ntr )కూడా బిచ్చం పెట్టరు అంటారు కానీ తనతో పాటు నటించే నటన పాటలు నటుల పట్ల లేదంటే తనతో పాటు ప్రయాణం చేసే వ్యక్తుల పట్ల ఎప్పుడూ ఎంతో శ్రద్ధతో ఉంటారు వారికి ఏదైనా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు తన కళ్ల ముందు ఎవరైనా బాధపడుతుంటే చూస్తూ ఉండలేరు.అందుకే తనను తోటి నటుడైన చలం డబ్బుల విషయంలో ఇబ్బందులు పడుతున్నాడని తెలిసి తనతో ఓ సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు నందమూరి రామారావు.

ఇక 1980 ప్రాంతంలో హాస్యనటుడు చలం(Chalam ) మరో నిర్మాత కే వి వి సత్యనారాయణ తో కలిసి ఎన్టీఆర్, దాసరి నారాయణరావు కాంబినేషన్లో ఒక సినిమా తీయాలని ప్లాన్ చేశారు అప్పట్లో ఈ కాంబినేషన్ కి విపరీతమైన క్రేజ్ ఉండేది.ఇదే సమయంలో ఆర్థికపరమైన ఒడిదుడుకుల్లో ఉన్న చలానికి సహాయం చేద్దామని మంచి మనసుతో ఎన్టీఆర్ దాసరి ఇద్దరు కూడా(Dasari Narayana Rao) ఒక చిత్రాన్ని తీయడానికి అంగీకరించారు.మీది కాంబినేషన్లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి ఇక మరోసారి కుదిరితే మంచి సినిమా వచ్చే అవకాశం ఉండేది కానీ సినిమా ప్రయత్నాలు ఫలించాయన్న ఆనందంలో చలం రాత్రి పగలు అనే తేడా లేకుండా తాగడం ప్రారంభించారు.
ఈ విషయం ఆ నోట ఈ నోట తెలిసి ఎన్టీఆర్ వరకు వెళ్ళింది.

దాంతో ఎన్టీఆర్ కి బాగా కోపం వచ్చింది అవకాశం ఇస్తే ఇలా చేయడం ఎన్టీఆర్ కి ఎప్పుడు నచ్చదు దాంతో నేరుగా చలంకే కబురు చేశారు ఇప్పుడే ఇంత తాగుతున్నాడు రేపు షూటింగ్ మొదలుపెట్టాక తాగి చెట్టుకు వస్తాడేమో అని అనుకొని ఇక సినిమా చెయ్యను అంటూ చెలంకి కబురు చేశారట ఎన్టీఆర్.అలా చలంతో సినిమా తీయకుండా ఆపేశారు కానీ కొంతమంది తన స్నేహితుడైన చలం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఎన్టీఆర్ ఎలాంటి సహాయం చేయలేదు కాబట్టి ఆయన చరమాంకం లో చాలా కష్టాలు పడ్డాడు అనుకుంటారు కానీ ఆయన సహాయం చేయాలని అవకాశం ఇచ్చిన అది చలం నిలబెట్టుకోలేదని ఎవరికీ తెలియదు.







