మెగా బ్రదర్ నాగబాబు హీరోగా ఎంట్రీ ఇచ్చినా కూడా సక్సెస్ అవ్వలేక పోయాడు.చిరంజీవి తో అంజనా ప్రొడక్షన్స్ ను మొదలు పెట్టి సినిమా లను నిర్మించాడు.
ఆ సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.ఒకటి రెండు సినిమా లు ఆకట్టుకున్నా ముఖ్యంగా ఆరెంజ్ సినిమా అదిరిపోయేంత గా అట్టర్ ప్లాప్ అయ్యింది.
ఆ సినిమా ప్లాప్ మిగిల్చిన అప్పుల నుండి ఇప్పటి వరకు నాగబాబు బయట పడలేదు అంటారు.ఆ సమయంలో పవన్ కళ్యాణ్ సాయం వల్ల నాగబాబు కాస్త కోలుకున్నాడు.
ఇప్పుడు నిర్మాతగా మళ్లీ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నాడు.అల్లు అర్జున్ ప్రోత్సాహంతో పెద్దగా పెట్టుబడి పెట్టకుండానే నా పేరు సూర్య సినిమా కు నిర్మాతగా వ్యవహరించాడు.
ఇప్పుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం లో వరుణ్ తేజ్ హీరోగా రూపొందబోతున్న ఒక సినిమా కు నిర్మాతగా నాగబాబు వ్యవహరించబోతున్నాడు.ఆ సినిమా నిర్మాణం లో నాగబాబు దాదాపుగా 30 శాతం పెట్టబడి పెట్టబోతున్నాడట.
ఇక ఈమద్య కాలంలో పెద్ద హీరోల సినిమా లు సక్సెస్ అయినా కాకున్నా కూడా లాభాలు వస్తున్నాయి.కనుక చిరంజీవి లేదా రామ్ చరణ్ ఒక్క సినిమా ను పారితోషికం లేకుండా చేస్తే నాగబాబు ఆర్థికంగా నిలదొక్కకుంటాడు కదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
నాగబాబు ఒక ఇంటర్వ్యూలో తాను అడిగితే తప్పకుండా రామ్ చరణ్ లేదా చిరంజీవి అన్నయ్య డేట్లు ఇస్తారు.కాని నేను మాత్రం ఇప్పుడు వారితో సినిమా చేయాలని భావించడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.
నాగబాబు నిర్మాతగా మళ్లీ వరుణ్ తేజ్ సినిమా తో సక్సెస్ అయితే అప్పుడు తప్పకుండా చరణ్ లేదా చిరంజీవి తో సినిమా ను చేసే అవకాశాలు ఉన్నాయి.భారీ అంచనాలున్న చిరంజీవి సినిమా లు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి.2024 లో అయినా తమ్ముడు సినిమా లో నటిస్తాడేమో చూడాలి.