నిజం నుంచి మురళీ మోహన్ తొలగింపు.. తేజపై మండిపడ్డ సినీ పెద్దలు.. చివరకు ఏమైంది?

తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మురళీ మోహన్.ఏపాత్ర అయినా సరే అందులో లీనమై నటించే సత్తా ఉన్న ఆర్టిస్టు తను.

 Why Murali Mohan Is Removed From Nijam Movie Details, Director Teja, Teja Nijam-TeluguStop.com

అయితే పలు సందర్భాల్లో ఈ నటుడు ఎన్నో ఆటుపోట్లను ఎదర్కొన్నాడు.సినిమా మొదలై శుభం కార్డు పడే వరకు తమ పాత్ర ఉంటుందో, ఉండదో చెప్పడం కష్టం.

అలాంటి ఘటనే ఓసారి మురళీ మోహన్ కు ఎదురైందట.ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన.ఓ సినిమా విషయంలో చాలా బాధ పడ్డాడట.ఇంతకూ తనకు ఎదురైన ఆ ఘటన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకప్పుడు మంచి జోష్ లో ఉన్న దర్శకుడు తేజ పలు అద్భుత సినిమాలు తెరకెక్కిస్తున్న సమయం అది.చిత్రం, నువ్వునేను, జయం లాంటి సినిమాల విజయంతో మంచి దర్శకుడిగా పేరు సంపాదించాడు.అదే సమయంలో మహేష్ బాబు హీరోగా నిజం అనే సినిమాను తీశాడు.ఇందులో హీరోయిన్ గా రక్షిత నటించింది.సెకెండాఫ్ లో మురళీ మోహన్ కు ఓ మంచి రోల్ ఉంటుంది.దాదాపు ఆయనను పెట్టి సినిమాను పూర్తి చేశారు.

అయితే ఆ పాత్రకు మురళీ మోహన్ సరిగా న్యాయం చేయలేదని ఆయనను తొలగించి శ్రీహరిని సంప్రదించాడు.అప్పటికే తను బిజీగా ఉండటంతో ప్రకాష్ రాజ్ ను సూచించాడు.

దీంతో మురళీ మోహన్ క్యారెక్టర్ ను ప్రకాష్ రాజ్ చేశాడు.అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.

అటు మురళీ మోహన్ ఈ విషయాన్ని చాలా సీరయస్ గా తీసుకున్నాడు.తనకు జరిగిన అన్యాయాన్ని సినీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు.తనకు రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.కానీ ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడి రూ.5 లక్షలకు రాజీ చేశారు.దీంతో సినిమా పరిశ్రమలో ఏ స్థాయిలో ఉన్న వ్యక్తికి అయినా ఇబ్బందులు తప్పవనే విషయం నిరూపితం అయ్యింది.ముర‌ళీమోహ‌న్ బాడీ లాంగ్వేజ్, లిప్ మూమెంట్ స‌రిగా లేవని చెప్పి ఆయనను ఈ సినిమా నుంచి తప్పించాడట తేజ.వాస్తవానికి తేజ తీరుపట్ల చాలా మంది తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారట.

Why Murali Mohan Is Removed From Nijam Movie Details

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube