మురళి మోహన్ సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవ చేసిన మొన్నటి తరం హీరో.82 ఏళ్ల వయసులో కూడా ఎంతో చురుగ్గా సినిమాల్లోనూ అటు రాజకీయాల్లోనూ పాల్గొంటూ తనకు వయసు పెరగలేదు అని నిరూపించుకుంటున్నారు. మురళీమోహన్ అసలు పేరు మాగంటి రాజబాబు.పశ్చిమగోదావరి జిల్లాలో స్వాతంత్ర్య సమరయోధుడైన మాగంటి మాధవరావు కి కొడుకు గా 1940లో జన్మించాడు.సినిమాల్లోకి రాకముందు వ్యాపారం చేసుకుంటూ తన జీవితం ఏంటో తను చూసుకుంటూ ఉండేవాడు.
తనతో పాటు ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్న కృష్ణ సినిమాల్లోకి వెళ్లడంతో అతడికి సినిమాల పట్ల ఆకర్షణ కుదిరింది.
కానీ కృష్ణని వెళ్లి తనకు అవకాశం ఇప్పించమని అడగడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చింది. కృష్ణ, మురళీమోహన్ కలిసి ఒకే బెంచ్ లో కలిసి చదువుకున్నారు.చాలా దగ్గర మిత్రులు అయినా అవకాశం కోసం ఏనాడు ఆయన ఇంటి గడప తొక్కలేదు మురళీమోహన్.
మెల్లిగా నాటకాల్లో నటిస్తున్న సమయంలో శోభన్ బాబు పిలవడంతో సినిమాల్లో నటించడానికి ఆసక్తి పెంచుకున్నాడు.
జగమే మాయ అనే సినిమాలో మొదటిసారి మురళీమోహన్ నటించాడు.ఆ తర్వాత ఏకంగా 350 సినిమాల్లో నటించి తిరుగులేని అభిమానాన్ని సంపాదించుకోగలిగాడు.
జయభేరి ఆర్ట్స్ స్థాపించి ఎన్నో సినిమాలను సైతం నిర్మించాడు.ఇండస్ట్రీకి వచ్చి ఎంత సంపాదించినా, ఎంత పేరు వచ్చిన కూడా ఏనాడు తన స్నేహితుడిని రారా, ఏరా, పోరా అని పిలవలేదు.
చదువుకున్న రోజుల్లో ఇద్దరు కలిసి బాగా అల్లరి చేసేవారు, కొట్టుకునేవారు కానీ ఇండస్ట్రీలోకి వచ్చాక తన సీనియర్ కాబట్టి కృష్ణకి అంతే మర్యాద ఇచ్చాడు మురళీమోహన్.

ఇక మురళీమోహన్ వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయనకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు బిందు మాధవి అనే కుమార్తె, రామ్మోహన్ అనే కుమారుడు ఉన్నాడు.వారిని సినిమా ఇండస్ట్రీకి రానివ్వలేదు, బిజినెస్ లు చూసుకుంటూ ఉండాలని మురళీమోహన్ కోరుకున్నాడు.ఆయన నటించిన అనేక సినిమాలకి అవార్డులు రివార్డులు అందుకున్నాడు మురళీ మోహన్.
ఇప్పటికీ ఎక్కడైనా కృష్ణ కనిపిస్తే గారు అని మర్యాదగా సంబోధిస్తాడు మురళీమోహన్.