మహేష్ బాబు… ఇతడి అంద చందాల గురించి, సినిమాల గురించి, కుటుంబం గురించి ఇలా అనేక ఆర్టికల్స్, విషయాలు సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి.అయితే చాలా మంది అనుకునేది ఏంటంటే మహేష్ బాబు పై ఎందుకు ఎలాంటి గాసిప్స్, రూమర్స్ రావు అని.
అతడితో ఏ హీరోయిన్ కి లింక్ చేస్తూ వార్తలు మాత్రం రావు.మహేష్ బాబు పూర్తిగా నమ్రత విధేయుడిగా ఉంటూ తన పైన ఎలాంటి వార్తలు పుట్టకుండా చూసుకుంటూ ఉంటాడు.
అంతే కాదు మహేష్ బాబు పూర్తిగా నిబద్దత తో, కుటుంబానికి మాత్రమే విలువ ఇస్తూ అనవసరపు వార్తలను ఎంకరేజ్ చేయకుండా ఉండటానికి వెనక బలమైన కారణం ఉంది.
అదేంటంటే తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు.
అందులో ఒకరు మహేష్ బాబు అమ్మ ఇందిరా దేవి గారు అలాగే మరొక ఇందిరా దేవి గారి అమ్మ దుర్గమ్మ గారు.తన చిన్నతనం నుంచి మహేష్ బాబు ఎక్కువగా తన అమ్మమ్మ అయినా దుర్గమ్మ దగ్గరే పెరిగారు.ఆవిడా మహా స్ట్రిక్ట్ అయినా వ్యక్తి.అంతే కాదు సినిమాల తాలూకు నీడ కూడా అతడిపైకి రాకుండా ఉండాలని దుర్గమ్మ ప్రయత్నించారట కానీ అది జరగలేదు.అలాగే పెళ్లి విషయంలో కూడా నమ్రతను తొలుత ఆవిడా రిజెక్ట్ చేశారట.సరే ఆ సంగతి మరొకసారి తెలుసుకుందాం.
అయితే కృష్ణ రెండో పెళ్లి చేసుకోవడం వల్ల తన కూతురికి అన్యాయం జరిగింది.

అందుకే మహేష్ బాబు కి ఆలా తన తల్లికి జరిగిన అన్యాయం పై దుర్గమ్మ బాధ పడటాన్ని కళ్లారా చూసేవాడు మహేష్ బాబు.సినిమా ఇండస్ట్రీ కి వచ్చాక సైతం తన తండ్రి విజయ నిర్మల తో ఉండటం వల్ల తన తల్లి పడుతున్న మానసిక క్షోభ కూడా అతడు కళ్లారా చూసాడు.అందుకే తన జీవితంలో ఉన్న ఇద్దరు ఈ మహిళల బాధను చూసాడు కాబట్టి తన వల్ల మాత్రం భవిష్యత్తు లో ఎవరికి అన్యాయం జరగకూడదని ఫిక్స్ అయ్యాడట.
అందుకే నమ్రతను మాత్రమే తన జీవితంలోకి ఆహ్వానించినా మహేష్ మరే అమ్మాయి విషయంలోనూ అలాంటి బలహీనతలు గురవ్వలేదు.అది మరి తల్లి కి అతడు ఇచ్చిన విలువ.







