చిత్ర పరిశ్రమలో నటి నిత్యమీనన్ అభినయం గురించి అందరికీ తెలిసిందే.మలయాళీ ఇండస్ట్రీ నుంచి ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇలా పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో లలో నటిస్తూ సందడి చేస్తున్నటువంటి నిత్యమీనన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా నిత్యామీనన్ పెళ్లి గురించి మాట్లాడటమే కాకుండా తనకు కాబోయే వ్యక్తి ఎలా ఉండాలో కూడా తెలియజేశారు.
తాను హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఎంతగానో గౌరవిస్తానని తెలిపారు.
అలాగే తనకు పెళ్లిపై కూడా చాలా నమ్మకం ఉందని తెలిపారు.అయితే పెళ్లంటే తన దృష్టిలో కేవలం సామాజిక భద్రతకు సంబంధించిన అంశమని అయితే అలాంటి భద్రత తనకు అవసరం లేదని తెలిపారు.
సోషల్ సెక్యూరిటీకి మించిన ఏదైనా కీలక అంశం ఉంటే అప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని తెలిపారు.

పెళ్లి అంటే కేవలం సోషల్ సెక్యూరిటీ మాత్రమే కాదు.అంతకుమించి అనే కోణంలో ఆలోచించే వ్యక్తి దొరికితే.తప్పకుండా పెళ్లి చేసుకుంటానని అలాంటి క్వాలిటీ ఉన్న వ్యక్తికనపడిన మరుక్షణమే తాను పెళ్లి చేసుకుంటానంటూ ఈ సందర్భంగా ఈమె పెళ్లి గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే గతంలో నిత్యమీనన్ పెళ్లి చేసుకోబోతున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఈ వార్తలను నిత్యమీనన్ పూర్తిగా ఖండించి తాను పెళ్లి చేసుకోలేదని చేసుకునేటప్పుడు కచ్చితంగా అందరితో పంచుకుంటానంటూ తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే.