Google, Google maps :గూగుల్‌లో లైవ్ వ్యూ ఫీచర్ లాంచ్.. కొత్త ప్రాంతాల్లో అదిరిపోయే ఎక్స్‌పీరియన్స్..!

గూగుల్ తాజాగా తన గూగుల్ మ్యాప్స్‌లో ‘లైవ్ వ్యూ’ ఫీచర్ రిలీజ్ చేసింది.ప్రస్తుతానికి కొన్ని సెలెక్టెడ్ నగరాల్లో మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉంది.

 Launch Of Live View Feature On Google.. Exciting Experience In New Areas,google,-TeluguStop.com

ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు తాము వెళ్తున్న ప్రాంతంలో షాపులు, భవంతులపై తమ ఫోన్ కెమెరాను ఫోకస్ చేయడం ద్వారా వాటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు.ఉదాహరణకి యూజర్ వెళ్తున్న మార్గంలో డిమార్ట్ ఉంటే.

డీమార్ట్ భవంతి మీ కెమెరాలో కనిపించగానే.దానిపై అదొక డిమార్ట్ అని వివరాలు కనిపిస్తాయి.

అంతేకాదు ఆ షాపులో పాపులర్ ఐటమ్ ఏంటి, షాపు ఎప్పుడు తెరుస్తారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారు వంటి వివరాలన్నీ డిస్‌ప్లే అవుతాయి.

కెమెరా ఆన్ చేసి ముందుకు వెళ్తూ చుట్టుపక్కల ఉన్న ఇతర షాపుల వివరాలన్నీ తెలుసుకోవడం ఈ ఫీచర్ తో చాలా ఈజీ అవుతుంది.

దీనివల్ల ఫలానా షాప్ ఎక్కడా అని ఒకరిని అడగాల్సిన పని తప్పుతుంది.ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో ఈ ఫీచర్ క్రియేట్ చేశారు.ఈ ఫీచర్‌తో గొప్ప షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందొచ్చు.షాపులతోపాటు హోటల్స్ రెస్టారెంట్స్ ఎక్కడ ఉన్నాయనే విషయం కూడా ఈ ఫీచర్ తెలుపుతుంది అలాగే ఒక హోటల్లో ఏది రుచికరమైన ఐటమ్ అనే వివరాలు కూడా మీరు గూగుల్ మ్యాప్స్ లో తెలుసుకోవచ్చు.

Telugu Google, Google Maps, Live View, Multi Search, Reality-Latest News - Telug

అంతేకాదు హోటల్ సర్వీస్ ఎలా ఉంటుంది, చండాలంగా ఉంటుందా లేక మంచిగా ఉంటుందా అనే వివరాలు కూడా రేటింగ్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు.అలాగే మల్టీ సెర్చ్ ఫీచర్‌తో ఒక ఫుడ్ ఫొటో తీసి, దాని పేరు ఏంటో తెలుసుకొని.లోకల్ హోటల్స్ లో దాని ధర కూడా మీరు తెలుసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube