పోన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ఫ్లాప్ అయిన కూడా సినిమా లో ఉన్న పెద్ద తారల వలన సెకండ్ పార్ట్ కి కూడా ఎంతో కొంత బజ్ క్రియేట్ చేయడం లో ఆ సినిమా స్టార్స్ సక్సెస్ అయ్యారు.తెలుగులో ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత చా మంది ఈ సినిమా గురించి నెగటివ్ లేదా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు.
మరి ముఖ్యంగా ఐశ్వర్య రాయ్, త్రిష( Aishwarya Rai, Trisha ) వంటి హీరోయిన్స్ హైదరాబాద్ లో సందడి చేసిన తర్వాత సినిమా కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.అయితే పార్ట్ 2 కోసమే బయ్యర్లు ముందుకు రావడం లేదు అనే టాక్ కూడా వినిపిస్తున్న ఈ తరుణం లో సినిమా విడుదల అయ్యాక సెకండ్ పార్ట్ ఏ కాస్త బాగున్న బ్రేక్ ఈవెన్ కి దాటే ఛాన్స్ ఉంది.

ఇక ఈ సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.ఈ సినిమాలో ఒక పాత్ర కోసం మహేష్ బాబు( Mahesh Babu ) ని, మరొక పాత్ర కోసం విజయ్ దళపతిని( Vijay Dalapati ) సంప్రదించాడట మొదట దర్శకుడు మణిరత్నం( Mani Ratnam ).అయితే డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం వల్ల ఆ విజయ్ దళపతి ఈ చిత్రం నుంచి బయటకు వచ్చాడట.ఇంత పెద్ద స్టార్స్ ని తీసుకుంటే బడ్జెట్ కూడా చేయి దాటి పోయే ప్రమాదం ఉండడంతో కొంతమేర ప్రమాదం ఉన్న కూడా మణిరత్నం మొగ్గు చూపారట.
అయితే మహేష్ బాబు మాత్రం తనకు ఇలాంటి పౌరాణిక చిత్రాలు లేదా చరిత్రకు సంబంధించిన పాత్రలు సూట్ కావు అని ఉద్దేశంతో ఒప్పుకోలేదని కానీ ఆ విషయం మణి రత్నం కి చెప్పకుండా డేట్స్ సమస్య ఉంది అని చెప్పే తప్పించుకున్నాడని ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.

ఈ విషయం తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో మహేష్ బాబు విజయ్ ఈ చిత్రాన్ని చేయకపోవడం నిజంగా మంచి విషయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు వారిద్దరికీ ఆ సినిమా సూట్ కాదని, మహేష్ బాబు కన్నా, విజయ్ కన్నా కూడా కార్తీ చక్కగా నటించాడని ఇంతకు ముందే కార్తీక్( Karthik ) ఇలాంటి సినిమాలు చేసిన అనుభవం ఉండటం వల్ల ఈ సినిమాకి అతడు మాత్రమే బాగా నప్పాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.మణిరత్నం లాంటి ఒక దీక్ష దర్శకుడు తీసిన సినిమా మొదట్లో నెగటివ్ టాకీ రావడం ఒకింత బాధాకరం అయినప్పటికీ పార్ట్ 2 అయిన హిట్ అవ్వాలని కొంతమంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు.