అందుకే మహేష్ - ఎన్టీఆర్ మిగితావారి కన్నా గ్రేట్

కాపేపు బాక్సాఫీస్ గోల పక్కనపెడితే, ప్రస్తుతం తెలుగులో "నటన" గొప్పగా చేయగల టాప్ స్టార్స్ ఎవరు అంటే అందరి నోట వచ్చే మొదటిరెండు పేర్లు సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌.

కేవలం హీరోయిజం, మ్యానరిజంకి పరిమితం అవకుండా, గుర్తుండిపోయే సన్నివేశాలెన్నో చేశారు వీరిద్దరు.

అంతేకాదు, ఎప్పుడూ సేఫ్ జోన్ చూసుకోలేదు.అంటే రీమేక్ సినిమాలు చేయలేదు.

కెరీర్ ఎలాంటి దశలో ఉన్నా, ఫ్లాపులు రుచి చూస్తున్నా, ఒరిజినల్ కథలనే నమ్ముకున్నారు తప్ప ఏదో భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని తీసుకొచ్చి ఇక్కడ రీమేక్ చేయలేదు.ఇక రీమేక్ లని సేఫ్ గేమ్ అని ఎందుకు అనాలంటే, అల్రెడి బ్లాక్బస్టర్ అయిన కథ ఉండటంతో పాటు, సినిమా తీయండంలో పెద్దగా తప్పులు జరగవు.

అందుకే రీమేక్ సినిమా అంటే సేఫ్ గేమ్.పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్ అందరు రీమేక్ సినిమాలు చేశారు.

Advertisement

మిగిలున్న అల్లు అర్జున్ ఓ కన్నడ సినిమా రీమేక్ ప్రయత్నాల్లోనే ఉన్నాడట.ఇప్పుడు సడెన్ ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే పూరి చేసిన ఓ కామెంట్ వలన."హీరోలు రీమేక్ సినిమాలు చేసే బదులు రిస్క్ చేయడమే మేలు" అని పూరి ఓ ప్రశ్నకు స్పందించారు.అందుకే, ఒక్క రీమేక్ సినిమా చేయకుండా ఇంతమంది అభిమానుల్ని, బాక్సాఫీస్ రికార్డులని సంపాదించుకున్న మహేష్ - ఎన్టీఆర్ మిగితావారి కన్నా గ్రేట్.

కూతుళ్లను హీరోయిన్స్ ని చేసిన నిన్నటి తరం అందమైన హీరోయిన్స్
Advertisement

తాజా వార్తలు