ఇటీవల కాలంలో బాలీవుడ్ కి ఏదో శాపం తగిలినట్టుగా ఉంది.విడుదలవుతున్న అన్ని సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్ అవుతుండడంతో పక్క భాషల దండయాత్ర కూడా పెరిగిపోయింది.
చిన్న చితక సినిమాలు కూడా హిందీలో రిలీజ్ చేస్తూ వాటి గ్రాఫ్ ని అలాగే ఏరియా ను పెంచుకుంటూ వెళ్తున్నాయి.ఇలాంటి సమయంలో ఖాన్ లు అందరు కట్టకట్టుకుని వచ్చినా కూడా ఆ బాలీవుడ్ ని కాపాడలేకపోతున్నారు.
లాల్ సింగ్ చడ్డా అలాగే రక్షాబంధన్ సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో మళ్లీ పరిస్థితి మొదటికే వచ్చింది.
ఇక ఇదే సమయంలో కార్తికేయ 2 సినిమాతో తెలుగులోనే చిన్న హీరోగా పేరు ఉన్న నిఖిల్ తన సినిమాని హిందీలో సైతం విడుదల చేశాడు.
పాన్ ఇండియా సినిమా అంటూ హడావుడి చేయకుండా ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా ఒక మంచి సినిమా అంటూ డబ్బింగ్ చేసి అన్ని భాషల్లోను విడుదల చేశాడు.దాంతో ఈ సినిమాకి సంబంధించిన థియేటర్స్ స్లోగా పెరుగుతూ వచ్చాయి.
అలాగే ఈ సినిమాలో మంచి కంటెంట్ కూడా ఉండడం ప్లస్ అయిందని చెప్పుకోవాలి.
ఇక ఈ సినిమాకి కలిసొచ్చిన మరో రెండు ‘అనుపమ’లు ఉన్నాయి.
ఈ అనుపమలు ఏంటి అనుకుంటున్నారా ? మొదటగా అనుపమ్ ఖేర్ గురించి చెప్పుకోవాలి.

కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో అనుపమ్ ఖేర్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు దాంతో ఆయనను ఈ సినిమాలో తీసుకున్నారు.తన పాత్ర కూడా చక్కగా పండటం తో అనుపమ్ఖేర్ ఒక ప్లస్ పాయింట్ గా మారాడు కార్తికేయ 2 సినిమాకి.ఇక ఈ సినిమాకి హీరోయిన్ అనుపమ కూడా మంచి కంటెంట్ ఇవ్వడంతో సినిమా మరో లెవల్ కి వెళ్ళింది.
ఇక అమీర్ ఖాన్ లాంటి వ్యక్తి చతికల పడ్డ చోట కార్తికేయ 2 చిత్రం థియేటర్లు పెంచుకుంటూ వెళ్తుంది ఇక అనుపమ, అనుపమ్ ఖేర్ మాత్రమే కాదు నిఖిల్ కూడా ఈ సినిమాకి ఆయువు పట్టు లాంటి వ్యక్తి.మొత్తానికి బాలీవుడ్ ని మరోసారి టాలీవుడ్ దెబ్బ కొట్టిందనే చెప్పుకోవాలి.