సినిమా కోసం మార్చురి గదిలోకి వెళ్లిన అమల పాల్.. పోస్ట్ మార్టం చూసి ఆ విషయం తెలుసుకుందట!

టాలీవుడ్ సినీ నటి కేరళ బ్యూటీ అమలాపాల్.తన అందంతో బాగా ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించింది.తెలుగులో కేవలం కొన్ని సినిమాలలో నటించగా ఆ తర్వాత ఇప్పటివరకు సినిమాలకు దూరమైయ్యింది ఈ బ్యూటీ.

 Amala Pal Who Went To The Mortuary Room For The Film Saw The Post Mortem And Fou-TeluguStop.com

2012లో లవ్ ఫెయిల్యూర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది.2013లో నాయక్ సినిమాలో నటించగా ఆ తర్వాత అదే ఏడాది ఇద్దరమ్మాయిలు సినిమా తో తన నటనకు మంచి గుర్తింపు అందుకుంది.ఆ తర్వాత జెండాపై కపిరాజు సినిమాలో నటించగా.

అంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన సంబంధించిన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు పంచుకుంటుంది.

ఇక అమలాపాల్ ఆ మధ్య తన విడాకుల విషయంలో బాగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ను ప్రేమ పెళ్లి చేసుకోగా.

నాలుగేళ్ల కే విడాకులు తీసుకుంది.ఇక ఇటీవలే ఆమె ఓ యువ సింగర్ భరిందర్ సింగ్ తో ప్రేమలో ఉన్నట్లు అంతేకాకుండా కొన్ని ఫోటోలు బయటకు రావడంతో వాళ్లకు పెళ్లి కూడా జరిగిందని వార్తలు వినిపించాయి.

కానీ వాటిని అమలాపాల్ పక్కకు తోసి పుచ్చింది.

Telugu Amala Paul, Cadaver, Kadavar, Kollywood, Love Failure, Bharinder Singh-Mo

ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండటంతో నిత్యం ఏదో ఒక ఫోటో పంచుకుంటూ బాగా సందడి చేస్తుంది.ఇక ప్రస్తుతం తను పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది.ఇదిలా ఉంటే తను ఒక సినిమా కోసం ఏకంగా మార్చురీ గదిలోకి వెళ్లిందట.

అంతేకాకుండా పోస్టుమార్టం చేయడం కూడా నేరుగా చూసిందట.

తాజాగా అమల నటించిన ‘కడవర్‘ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫాం లో విడుదలైంది.

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందింది.ఇక ఈ సినిమా ఓటీటీ లో ఆగస్టు 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

తాను అందులో భద్ర అనే పాత్రలో నటించింది.తాజాగా తన భద్ర పాత్రలో పొందిన అనుభూతులు పంచుకుంది.

ఈ సినిమా కోసం తాను చాలా ఎక్కువ గ్రౌండ్ వర్కు చేయాల్సి వచ్చిందని దర్శకుడు, రచయితతో కలిసి చాలామందిని కలిశామని, పలు హాస్పిటల్స్ కు వెళ్ళామని తెలిపింది.

Telugu Amala Paul, Cadaver, Kadavar, Kollywood, Love Failure, Bharinder Singh-Mo

ఇక ఈ సినిమాలు భాగంగానే తాము మార్చురీకి కూడా వెళ్ళామని తెలిపింది.ఇక నేరుగా పోస్ట్ మార్టం చేయటాన్ని తాను చూసిందట.అది జీవితాన్ని మార్చే అనుభవంగా ఉందని తెలిపింది.

ఇక నేరుగా పోస్టు మార్టం చేయటం చూశాక.అక్కడి దృశ్యాలు మనసును కదిలించాయట.

ప్రాణం లేని శరీరాన్ని చూసినప్పుడు నిజంగా ప్రాణం లేదా? మేలుకొని లేదా? అన్నట్లుగా అనిపించందని తెలిపింది.ఏదేమైనా సినిమా మీద ఫ్యాషన్ వేరు.

దాని కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించటం పేరు అన్నట్లు అమలాపాల్ తన పాత్రతో నిరూపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube