బింబిసార.. సీతారామం.. కార్తికేయ 2.. ఈ మూడులో ఏది బెస్ట్

టాలీవుడ్‌ బాక్సాఫీస్ జోరు మీద ఉంది.మొన్నటి వరకు బింబిసార మరియు సీతారామం సినిమా లు సందడి చేశాయి.

 Bimbisara Sitaramam And Karthikeya 2 Movie Collections Bimbisara, Sitaramam ,-TeluguStop.com

ఇప్పుడు కార్తికేయ 2 సినిమా యొక్క సందడి కొనసాగుతూ ఉంది.పెద్ద ఎత్తున బింబిసార మరియు సీతారామం సినిమా ల వసూళ్లు చూసిన బాక్సాఫీస్‌ వర్గాల వారు ఇప్పుడు అంతకు మించి వస్తున్న కార్తికేయ 2 సినిమా యొక్క వసూళ్లకు ఆశ్చర్య పోతున్నారు.

కేవలం నాలుగు రోజుల్లో 35 కోట్లకు మించి వసూళ్లు నమోదు అయ్యాయి.ఈ వీకెండ్‌ లో సినిమా కి భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సీతారామం సినిమా కి 50 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి.అలాగే సీతారామం సినిమా తో పాటు బింబిసార సినిమా కి కూడా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి.

లాంగ్ రన్ లో బింబిసార 50 కోట్ల మార్క్ ను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే కార్తికేయ 2 మాత్రం 60 నుండి 70 కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.

ఉత్తర భారతంలో ఈ సినిమా మెల్ల మెల్ల గా భారీ వసూళ్ల దిశగా దూసుకు పోతుంది.మొన్నటి వరకు అక్కడ విడుదల అయిన హిందీ సినిమా లు సాధించిన సినిమాలతో పోల్చితే ఈ సినిమా కు ఎక్కువ వసూళ్లు నమోదు అవుతున్నాయి.

అందుకే సీతారామం సినిమా యొక్క వసూళ్ల విషయం లో మరియు కార్తికేయ 2 సినిమా యొక్క వసూళ్ల విషయంలో పోలికలు చేస్తున్నారు.కార్తికేయ 2 సినిమా భారీ గా వసూళ్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

లాంగ్ రన్‌ లో సీతారామం సినిమా తో పోల్చితే తప్పకుండా కార్తికేయ 2 సినిమా ఎక్కువ వసూళ్లను కలిగి ఉంటుంది అనేది చాలా మంది అభిప్రాయం.అతి త్వరలోనే కార్తికేయ 2 సినిమా 50 కోట్ల మార్క్ ను చేరువ అయ్యిందని వార్తలు వస్తాయి.

ఆ వెంటనే మరో మైలు రాయి అంటూ వార్తలు రావడం ఖాయం.కనుక కార్తికేయ 2 సినిమా ఈ ఏడాది మేటి సినిమా ల జాబితాలో టాప్ లో ఉన్నా ఆశ్చర్యం లేదు.

బింబిసార.సీతారామం సినిమా లతో పోల్చితే కార్తికేయ 2 సినిమా భారీ వసూళ్లు నమోదు చేయడం పక్కా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube