ఎన్టీఆర్ ప్రేమతో కట్టించుకున్న ఆ థియేటర్ బూతు థియేటర్ గా ఎందుకు మారింది?

ఎన్టీఆర్. సినిమాలతో పాటు రాజకీయాలని ఏకచత్రాధిపత్యంతో తనదైన రీక్తిలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి.

 Why Kachiguda Taraka Rama Theatre Turned B Grade Theatre Details, Nandamuri Tara-TeluguStop.com

సినిమాల్లో ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో హైదరాబాద్లో అనేక ఆస్తులు సంపాదించారు.అలా ఆయన వెనకేసుకున్న ఆస్తులలో చెప్పుకోదగ్గ ప్రాపర్టీ కాచిగూడ లోని తారకరామ థియేటర్.

వాస్తవానికి ఈ థియేటర్ కట్టకముందు కాచిగూడ చౌరస్తాలోని ఈ స్థలంలో కొంతమంది పిట్టలను వేటాడి జీవనం సాగిస్తు నివసించేవారు.

వారిని నయానో భయానో ఒప్పించి అక్కడి నుంచి బయటకు పంపించేసి, వినని వారిని డబ్బులు ఇచ్చి మరీ ఖాళీ చేయించి ఆ స్థలాన్ని సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్.

ఆ చోటులో తారకరామ అనే థియేటర్ కట్టారు.అక్బర్ సలీం అనార్కలి సినిమాతో ఆ థియేటర్ ను ప్రారంభించాలని ఎన్టీఆర్ కోరుకున్నారు.కానీ థియేటర్ కట్టడం లేటు కావడంతో మొదట ఆంధ్ర, సీడెడ్ లో ఆ చిత్రం విడుదలైంది.అక్కడ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న తర్వాత నైజాంలో విడుదల చేయగా అది కేవలం ఈ థియేటర్లో 22 రోజులు మాత్రమే ఆడి ఫ్లాప్ చిత్రంగా నిలిచింది.

తెలుగు, హిందీ చిత్రాలను ఎక్కువగా ప్రదర్శనకు ఉంచిన ఈ థియేటర్లో ఎక్కువ రోజులు ఆడిన సినిమా డాన్.అమితాబ్ నటించిన ఈ చిత్రం 525 రోజులు ఆడి రికార్డు సృష్టించింది.

Telugu Akbarsaleem, Asiantaraka, Geetanjali, Kachiguda, Nandamuritaraka, Ntr The

ఆ తర్వాత గీతాంజలి 225 రోజులు, ఇంకా మరికొన్ని సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి.

ఇక 1991 లో రాజీవ్ గాంధీ హత్యానంతరం ప్రతిపక్ష నాయకుల ఆస్తులపై జరిగిన దాడులలో ఈ థియేటర్ ధ్వంసం అయింది.దాంతో 1995లో మళ్ళీ దీనిని పునరుద్ధరించారు.కానీ అప్పటికే దాని వైభవాన్ని కోల్పోయింది తారకరామ థియేటర్. ఆ తర్వాత విడుదలైన ఏ సినిమా కూడా ఆడలేదు దాంతో క్రమంగా అది బి సెంటర్ థియేటర్ గా మారిపోయింది.ఆంగ్ల, మలయాళ బూతు చిత్రాలు అక్కడ ప్రదర్శించడానికి పెట్టాల్సి వచ్చింది.

Telugu Akbarsaleem, Asiantaraka, Geetanjali, Kachiguda, Nandamuritaraka, Ntr The

ఆ తర్వాత ఏషియన్ వారు ఈ థియేటర్ నీ లీజ్ కి తీసుకొని మల్టీప్లెక్స్ చేశారు.ఏషియన్ తారకరామా అంటూ మరొక మల్టీప్లెక్స్ రూపంలో దాన్ని తీసుకొచ్చారు అయినా కూడా దానికి వచ్చిన ఇబ్బందులు తొలగలేదు.ఎంతో విశాలంగా దాన్ని అభివృద్ధి చేసినా కూడా ఆ థియేటర్లో అత్యధికంగా ఆడిన సినిమా ఉరి ద సర్జికల్ స్ట్రైక్.ఇది కేవలం 73 రోజులు మాత్రమే ఆడింది.

ఇలా ఎన్టీఆర్ ఎంతో ఇష్టపడి కట్టుకున్న థియేటర్ కాస్త బి గ్రేడ్ థియేటర్ గా ఆ తర్వాత, అద్దె కూడా వసూలు చేయలేని థియేటర్ గా మారడం నిజంగా బాధాకరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube