ఆస్తులన్నీ ఆమెకే ఆమె మాత్రమే అంత స్పెషల్ ఎందుకు..?

సీనియర్ నటుడు శరత్ బాబు( Sarath Babu ) ఇటీవల కన్నుమూశారు అయితే అయన ఆస్తులపై ఇంకా చర్చలు సాగుతూనే ఉన్నాయి.శరత్ బాబు రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు అయితే అటు రమాప్రభతో( Ramaprabha ) కానీ.

 Why Is She So Special That All The Properties Belong To Her , Sharath Babu , Ram-TeluguStop.com

స్నేహలతతో కానీ శరత్ బాబుకి సంతానం లేదు.దీంతో తన అన్నాచెల్లెల్ల బిడ్డలనే తన బిడ్డలుగా భావించేవారు .వాళ్లు మొత్తం 25 మంది ఉండటంతో వాళ్లే తన బిడ్డలని అని శరత్ బాబు అనేవారు.అయితే ఆయన మరణం తరువాత ఆస్తులకు వారసులు ఎవరన్నదానిపై చర్చ మొదలైంది.

శరత్ బాబు చిన్న చెల్లెలు సరిత( saritha ) పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తుంది .తనని బిడ్డలా పెంచుకున్న అన్న లేరని తెలిసి కన్నీటి పర్యంతం అయిన సరిత.

 Why Is She So Special That All The Properties Belong To Her , Sharath Babu , Ram-TeluguStop.com
Telugu Lucknow, Ramaprabha, Sharath Babu, Sony, Tollywood-Movie

శరత్ బాబుతో ఉన్న అనుబంధాన్ని చెప్పుకుని భావోద్వేగానికి గురయ్యారు.అతనికి ఈ జన్మలో నేను చెల్లెల్ని.కానీ వచ్చే జన్మ మాత్రం ఉంటే.ఆయనకి నేను కూతురుగా పుట్టాలి.

అంత ప్రేమగా చూసుకునేవారు.నాకు ఏ లోటు చేయలేదు.

ఏది కావాలన్నా క్షణాల్లో తెచ్చి ఇచ్చేవారు.ఆ భగవంతుడు అవకాశం ఇస్తే.

అతనితోనే నేను వెళ్లిపోవచ్చు కానీ.నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి.

నేను ఉండేది లక్నోలో కానీ.సమయం దొరికితే నన్ను రమ్మనిపిలిచేవారు.

షూటింగ్‌లకు కూడా పిలిచేవారు.నా తల్లిదండ్రులు చనిపోయిన తరువాత.

మా అన్నయ్యే నాకు తల్లి, తండ్రి.నా పెళ్లి కూడా అన్నయ్యే చేశారు.

నన్ను బిడ్డగా చూసుకున్నారు.నాకు పుట్టిన బిడ్డని కూడా చాలా బాగా చూసుకున్నారు అని చెప్పుకొచ్చింది .

Telugu Lucknow, Ramaprabha, Sharath Babu, Sony, Tollywood-Movie

మా అన్నదమ్ముల సంతానాన్ని అందరూ నా కూతుర్లే.అందరూ నా కొడుకులే అనేవారు అన్నయ్య.కానీ నా కూతురు పెళ్లి అన్నయ్య చేతుల మీదుగా చేశారు.ఆయన రుణం నేను తీర్చుకోలేను.కన్యాదానంతో రుణం తీర్చుకున్నాను.నా కొడుకుని కూడా చదివిస్తున్నారు.

నా కూతురు సోనీని( Sony ) దత్తత తీసుకోవాలని అనుకున్నారు.సోనీని నాకు ఇచ్చెయ్ అమ్మా అని అనేవారు.

నన్ను కూడా నా కూతురే అనేవారు.అందర్నీ ప్రేమించేవారు అని ఆమె చెప్పుకొచ్చింది .ఇక .శరత్ బాబు ఆస్తుల గురించి సరిత ప్రస్తావించింది .సోనీని దత్తత తీసుకోవాలని శరత్ బాబు గారు చూశారు కదా.ఇప్పుడు ఆయన లేరు.ఆయన ఆస్తులు మీ కూతురికి మీకే చెందుతాయా.అనే ప్రశ్న ఆమెకు ఎదురవగా .నాకు ఆ విషయాలు తెలియవు.అన్నయ్యే లేనప్పుడు ఆస్తులది ఏముందిఅంటూ సమాధానం ఇచ్చారు.

సరిత.ఆస్తులు గురించి మాట్లాడనే లేదు.మరి ఆస్తులు ఎవరికీ చెందుతాయి .25 మంది సమానంగా పంచుకుంటారు .ఎవరు పెద్దరికం తీసుకుంటారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube