సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వాళ్ళకంటూ ఒక ఇమేజ్ చట్రంలో ఇరుక్కొని కొన్ని మంచి సినిమాలను వదిలేసుకోవాల్సి వస్తుంది.ఇక మన ఇండస్ట్రీ లో ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh babu ) కూడా మంచి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ని అయితే తెచ్చుకున్నారు.
అయితే ఆయన తన ఇమేజ్ కి ఆ స్టోరీ సరిపోదని ఒక సినిమా ని వదిలేసుకోవాల్సి వచ్చింది.మహేష్ బాబు అంటే ఇండస్ట్రీలో ఓ మంచి క్రేజ్ ఉంది ఎప్పుడైతే పోకిరి సినిమా వచ్చిందో అప్పటినుంచి మహేష్ బాబు హీరోగా అవతరించడమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఆయన ఒక టాప్ హీరోగా మారిపోయాడు.
అయితే సినిమా ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ గౌతమ్ మీనన్( Gautham Vasudev Menon ) చాలా సంవత్సరాల క్రితం మహేష్ బాబుతో ఏ మాయ చేసావే సినిమా స్టోరీని వినిపించాడు కానీ ఆ స్టోరీని విన్న మహేష్ బాబు మన మధ్య సినిమా అంటే ఇలాంటి లవ్ స్టోరీస్ కాకుండా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండే సినిమా అయితే బాగుంటుంది సార్ అని గౌతమ్ కి చెప్పి పంపించినట్టుగా తెలుస్తుంది.ఇక అప్పుడు గౌతమ్ మీనన్ దగ్గర ఒక మంచి కథ ఉందని తెలుసుకున్న నాగార్జున తన కొడుకు అయిన నాగచైతన్యని పెట్టి ఈ సినిమా చేయాల్సిందిగా గౌతమీనన్ కి చెప్పాడు.దాంతో ఏ మాయ చేసావే సినిమా తమిళ్ వర్షన్ లో శంబు,త్రిష హీరో హీరోయిన్లు గా చేస్తే,తెలుగు వర్షన్ లో నాగచైతన్య ,సమంత నటించడం జరిగింది.
ఈ సినిమా మహేష్ బాబు చేసుంటే మహేష్ బాబు కి ఒక మంచి హిట్ పడుండేది…నాగ చైతన్య, సమంత ఇద్దరు కూడా ఈ సినిమాలో బాగా చేశారు.ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.ఇక నాగ చైతన్య కెరియర్ లో అతను అందుకున్న మొదటి సక్సెస్ కూడా ఇదే కావడం విశేషం…ఇదొక మంచి సినిమా ఈ సినిమాను గనక మహేష్ బాబు చేసుంటే తప్పకుండా ఈ సినిమా రీచ్ ఇంకోలా ఉండేది.
కానీ ఆయన ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయి ఈ సినిమా చేయకుండా దాంతో మహేష్ బాబు ఒక మంచి లవ్ స్టోరీ ని మిస్ అయిపోయాడనే చెప్పాలి…ఆ తర్వాత గౌతమ్ మీనన్ ఒక మంచి యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథ చెప్పిన కూడా మహేష్ బాబు బిజీ గా ఉండి ఆ సినిమా కూడా చేయలేకపోయాడు….