ముఖ్యమంత్రి జగన్ బలహీనమైన నాయకుడు కాదు.ఆయన పార్టీకి 22 మంది ఎంపీలున్నారు.151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చారు.మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో సీఎం జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టడం కుదిరే పని కాదు.
మరి కేంద్ర ప్రభుత్వమంటే జగన్ కు ఎందుకంత భయం.దీనికి బహిరంగంగా కనిపిస్తున్న కారణం ఆయనపై ఉన్న కేసులే.తమను ప్రశ్నించినా, వ్యతిరేకించినా బీజేపీ మాత్రం సహించదు.అయితే ఏమాత్రం సంకోచం లేకుండా సీబీఐ, ఈడీలను ప్రయోగింస్తోంది.ముఖ్యమంత్రి జగన్ పై కొత్తగా దర్యాప్తు సంస్థలను ప్రయోగించాల్సిన అవసరం లేదు.ఇప్పటికే ఆయనపై కేసులున్నాయి.
బెయిలుపై ఉన్నాడు.
అయితే కేంద్రప్రభుత్వం కొంచెం గట్టిగ ఉంటే సీఎం జగన్ మళ్లీ కష్టాలు తప్పవు అని తెలుస్తోంది.
కేంద్ర పెద్దలతో పూర్తిస్థాయి సామరస్యంగా ఉండడంతో పాటు.రాష్ట్ర ప్రయోజనాల గురించి గట్టిగా అడగటంలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే తను ముఖ్యమంత్రి హోదాలో అనేక సార్లు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలను కలిశారు.ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలతో వినతి పత్రం ఇచ్చారని అధికారులు చెబుతున్నారు.

కేంద్రం వద్ద ముఖ్యమంత్రి జగన్ ఏమీ సాధించకోలేరని , ఆయన మాటను కేంద్రం పట్టించుకోదని అనుకుంటే తప్పులో కాలేసినటే.ఏపీ రాష్ట్రానికి మేలు చేసేవి కాకుండా.తనకు తన వర్గానికి అవసరమైన అనేక పనులకు సీఎం జగన్ బతిమాలో బామాలో చేయించుకుంటున్నారు.తెలంగాణ కేడర్ లో ఉన్న శ్రీలక్ష్మిని ఏపీకి రప్పించేందుకు ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు.
కేంద్రం ఏమైనా ఇవ్వాలనుకున్నా ఒక్కోసారి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి.అందుకే చంద్రబాబు ఒక అడుగు కిందికి దిగి, కేంద్ర మంత్రులతో పాటు ఆ శాఖల కార్యదర్శులతో కూడా సమావేశమయ్యేవారు.
అయితే కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేడర్ అధికారులను ఢిల్లీకి పంపించేవారు.కానీ ఇప్పడు ఆ పరిస్థితే లేదు అని తెలుస్తుంది.







