గోపిచంద్ (Gopichand)హీరోగా శివ డైరెక్షన్ లో వచ్చిన శౌర్యం(Shauryam ) సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా గోపిచంద్ కెరియర్ లోనే ఒక అద్భుతమైన హిట్టు గా మనం చెప్పుకోవచ్చు…ఈ సినిమా లో గోపిచంద్ తన మాస్ పర్ఫామెన్స్ చూపించాడు.
అలాగే ఈ సినిమాలో అనుష్క నటన కూడా చాలా బాగుంటుంది.ఈ సినిమా హిట్ అయ్యాక గోపిచంద్ శివ కాంబో లోనే శంఖం అనే సినిమా వచ్చింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్లేదు అనిపించుకుంది.
ఈ సినిమా కి ఇప్పుడు టాప్ డైరక్టర్ అయిన అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైలాగ్స్ రాశారు.అయితే ఈ సినిమా తరువాత శివ రవితేజని హీరోగా పెట్టీ దరువు(daruvu) అనే సినిమా తీశాడు ఈ సినిమా ప్లాప్ అయింది.
దాంతో శివ ఎప్పుడు రొటీన్ సినిమాలు తీస్తాడు అనే బ్యాడ్ నేమ్ వచ్చింది.ఇక దాంతో ఆయన తమిళ్ ఇండస్ట్రీ కి వెళ్లి అక్కడ అజిత్ హీరో గా వరస సినిమాలు చేసి వరుసగా సక్సెస్ లు కొట్టాడు ప్రస్తుతం తమిళంలో ఆయన టాప్ డైరక్టర్ గా కొనసాగుతున్నారు.

అక్కడ అంతా పెద్ద డైరెక్టర్ అయిన శివ(Shiva) ఇక్కడ సక్సెస్ కాకపోవడానికి రీజన్ ఏంటంటే ఆయన తీసే సినిమాలు తెలుగులో ఇంతకుముందు వచ్చిన సినిమాల లానే ఉండటం ఆయన సినిమాల్లో సీన్లు వేరే సినిమాల్లో చూసినట్టు ఉండటం తో ఆయన ఇక్కడ సక్సెస్ కాలేకపోయారు… ప్రస్తుతం ఆయన సూర్య హీరోగా ఒక సినిమా చేస్తున్నారు.మళ్ళీ అన్ని కుదిరితే తెలుగులో కూడా ఒక సినిమా చేసి సక్సెస్ సాధించాలి అని చూస్తున్నట్టు తెలుస్తుంది…
.







