దిల్ రాజు ఎందుకు చిన్న సినిమాలు చేస్తున్నాడు అంటే..?

ప్రస్తుతం ఉన్న పరిస్థితి లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్ అయినా దిల్ రాజు( Dil raju ) చిన్న సినిమాలని కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.మంచి కాన్సెప్ట్ ఉంటె చాలు దిల్ రాజు చిన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తారు అని చాలా మంది అంటున్నారు.

 Why Is Dil Raju Doing Small Movies , Dil Raju, Balagam , Tollywood ,ram Charan,-TeluguStop.com

అయితే దీని వెనుక చాలా బిజినెస్ ట్రిక్స్ ఉన్నాయి అని చాలా మంది వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు…రీసెంట్ గా రిలీజ్ అయినా బలగం సినిమా మంచి విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే ఈ సినిమా తక్కువ బడ్జెట్ లో తీసి మంచి విజయాన్ని అందుకుంది.ప్రస్తుతం ఆయన ఇంకా చాలా చిన్న సినిమాలని తీసే పని లో ఉన్నట్టు తెలుస్తుంది.అటు రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు తీస్తూనే ఇటు వేణు( Venu ) లాంటి నటుడికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి అన్ని రకాల సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు దిల్ రాజు…

ఇక ఇది ఇలా ఉంటె దిల్ రాజు రామ్ చరణ్ తో సినిమా చేస్తూనే, పరుశురాం డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరో గా ఒక సినిమా చేస్తున్నారు.అలాగే ఇంకా కొంత మంది డైరెక్టర్స్ తో కథ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది…ఇంతకు ముందు తో పోల్చుకుంటే దిల్ రాజు సినిమాల్లో కొంత వరకు క్వాలిటీ తగ్గింది అని మరికొంత మంది అంటున్నారు.ఎందుకంటే బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం వంటి మంచి సినిమాలు చేసిన దిల్ రాజు ఒక బలగం సినిమా మినహా ఇస్తే మొన్నటిదాకా అన్ని కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చాడు…

 Why Is Dil Raju Doing Small Movies , Dil Raju, Balagam , Tollywood ,Ram Charan,-TeluguStop.com

అప్పట్లో దిల్ రాజు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు ఉండేవి, కానీ ఇప్పుడు అవి ఉండటం లేదు అందుకే దిల్ రాజు సినిమాలు అంటే జనాల్లో కూడా ఒక రకమైన కమర్షియల్ సినిమాలు అనే నమ్మకం వచ్చేసింది కానీ, మళ్లీ బలగం తో( Balagam ) మంచి సినిమాలు కూడా తీస్తున్నాడు అని మరోసారి ప్రూవ్ చేసారు దిల్ రాజు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube