కడ్రాయిర్లు కొనడం మానేసిన భారతీయులు... షాక్‌లో కంపెనీలు?

అవును, వినడానికి విడ్డూరంగా అనిపించినా మీరు విన్నది నిజమే.మనవాళ్లు కాడ్రాయిర్లు కొనడం బాగా తగ్గించారట.

 Why Indians Are Not Buying Underwears Details, Indians, Latest News, Key Decisio-TeluguStop.com

మరి వాడడం కూడా మానేశారా అనే అనుమానం వస్తే సమాధానం చెప్పడం ఒకింత కష్టం గానీ, ఈ పరిణామానికి సో కాల్డ్ ఇన్నర్ వేర్ కంపెనీలు మాత్రం దివాళా తీసే పరిస్తితికి వచ్చాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.అసలే పండుగల సీజన్.

ఇలాంటప్పుడు కూడా అండర్ వేర్ ( Underwear ) కొనకపోతే వారికి పబ్బం గడవడం కష్టమే కదా.కాబట్టి భారతీయులు కాస్త ఆలోచిస్తే బెటర్ అని ఆయా ఫారిన్ కంపెనీలు తమ గొడుని వెళ్లగక్కుతున్నాయి మరి.

Telugu Dollar, Indians, Jockey, Key, Latest, Underwears, Rupa-Latest News - Telu

పండగల సీజన్( Festival Season ) వచ్చిందంటే మనవాళ్లు పార్టీ వేర్ నుంచి ఆఫీస్ దుస్తుల వరకు అన్నింటిని కొనుగోలు చేస్తుంటారు.అయితే భారతీయులు( Indians ) అన్ని రకాల దూస్తులు కొంటున్నారు కానీ.అందులో మాత్రం లోదుస్తులు లేవు అని భోగట్టా.ఈ క్రమంలోనే దిగ్గజ కంపెనీలకు చెందిన అండర్ వేర్స్, ఇన్నర్ వేర్స్ కు సంబంధించిన విక్రయాలు భారీగా పడిపోయాయని తాజా సర్వేలు చెబుతున్నాయి.

ఈ నేపధ్యంలోనే ఇండియన్స్ అండర్ వేర్స్ కొనడం మానేయడంతోనే ఇలా విక్రయాలు తగ్గిపోయాయని సదరు కంపెనీలు తెలిపారు.

Telugu Dollar, Indians, Jockey, Key, Latest, Underwears, Rupa-Latest News - Telu

మరీ ముఖ్యంగా జాకీ,( Jockey ) రూపా,( Rupa ) డాలర్( Dollar ) లాంటి ఇన్నర్ వేర్ ల విక్రయాలు భారీగా పడిపోయాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.భారదేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు లోదుస్తులను, ఇన్నర్ వేర్ లను కొనడం మానేశారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.డిసెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో లోదుస్తుల వినియోగం ఏకంగా 55 శాతం తగ్గినట్టు సమాచారం.

జాకీ గత సంవత్సరం మెుదటి త్రైమాసికంతో పోలిస్తే.ఆదాయంలో 7.5 శాతం, పరిమాణాంలో 11.5 శాతం క్షీణతగా తేలింది.అదీకాక ఇండియన్స్ ఆన్ లైన్ షాపింగ్ కు ఎక్కువగా మెుగ్గు చూపడం, అక్కడ వారికి ఎక్కువ మెుత్తంలో డిస్కౌట్లు లభించడం కూడా కారణంగా చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube