గోపీచంద్.తెలుగు సినిమా పరిశ్రమలో మంచి నటుడు.తొలుత విలన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన.నెమ్మదిగా హీరోగా ఎదిగాడు.ఆ తర్వాత మంచి సినిమాలు చేసి సక్సెస్ ఫుల్ హీరోగా మారిపోయాడు.తన తొలి సినిమా తొలి వలపుతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నా.తనకు సరైన హిట్ మాత్రం పడలేదు.దీంతో విలన్ పాత్రలకు ఓకే చెప్పాడు.
తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా చేశాడు.ఈ సినిమా తర్వాత తనకు విలన్ వేషాలు వచ్చాయి.
ప్రభాస్ హీరోగా చేసిన వర్షం, మహేష్ బాబు హీరోగా చేసిన నిజం సినిమాల్లో విలన్ పాత్రలు పోషించాడు.ఓ వైపు విలన్ గా చేస్తూనే.మరో వైపు హీరో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు.అదే సమయంలో తన సొంత బ్యానర్‌లో యజ్ఞం సినిమా చేశాడు.
ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.దీంతో తను వెనక్కి తిరిగి చూసుకోలేదు.
యజ్ఞం తర్వాత రణం, ఆంధ్రుడు లాంటి సినిమాలు చేశాడు.ఈ సినిమాలు కూడా మంచి హిట్ అందుకున్నాయి.
ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మొగుడు సినిమా కారణంగా గోపీ చంద్ కెరీర్ పూర్తిగా పడిపోయింది.ఆ సినిమా తర్వాత తనకు మొత్తం అలాంటి అవకాశాలే రావడంతో అతడి మీద మూస సినిమాలు చేసే హీరో అనే స్టాంప్ పడింది.
గోపీచంద్ మొగుడు సినిమా చేయకపోతే ఆయన కెరీర్ మరోలా ఉండేదని మాత్రం చెప్పక తప్పదు.
విలన్ గా నటించినప్పుడు వచ్చిన పేరు.హీరోగా చేసినప్పుడు కూడా రాలేదని చెప్పుకోవచ్చు.వచ్చిన పేరును అలాగే కొనసాగించలేకపోయాడు కూడా.
హీరో అవకాశాల కోసం కాకుండా.విలన్ గా అలాగే కంటిన్యూ చేసినా మంచి కెరీర్ కంటిన్యూ చేసేవాడు.
ప్రస్తుతం హీరోగా ప్రయత్నాలు చేసినా.మంచి హీరో అయ్యేవాడని చెప్తారు.
గడిచిన కొంత కాలంగా లౌక్యం సినిమా మినహా ఆయన చేసిన ఏ సినిమా కూడా చెప్పుకోదగ్గ రీతిలో విజయం సాధించలేదు అని చెప్పుకోవచ్చు.తాజాగా మారుతి దర్శత్వంలో వస్తున్న కమర్షియల్ సినిమా అయినా హిట్ అందుకుని.
గోపీచంద్ కెరీర్ ను మలుపుతిప్పుతుందేమో వేచి చూడాలి.
అటు ప్రభాస్, గోపీచంద్ మంచి మిత్రులు.గోపీచంద్ తండ్రి కృష్ణ మంచి దర్శకుడు.ఈతరం ఫిలింస్ బ్యానర్ గోపీచంద్ హోం బ్యానర్.
అతడి అన్న ప్రేమ్ చంద్ కూడా దర్శకుడు కావాలి అనుకున్నాడు.కానీ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.2013లో గోపీచంద్ రేష్మను పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఓ అబ్బాయి ఉన్నాడు.