పక్కా హైదరాబాదీ అమ్మాయి అయిన ఫరియా అబ్దుల్లా( Faria Abdullah ) జాతి రత్నాలు సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకుంది.ఈ ముద్దుగుమ్మ సంజయ్ అబ్దుల్లా, కౌసర్ సుల్తానా దంపతులకు జన్మించింది.
హైదరాబాద్‌లోని మెరిడియన్, భావనా స్కూల్స్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్‌ను అభ్యసించింది.బాగా చదువుకున్న తర్వాత మూవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

ఫరియా 2021, మార్చి 11న విడుదలైన జాతి రత్నాలు అనే కామెడీ సినిమాతో టాలీవుడ్‌లో కాలు మోపింది.అనుదీప్ కెవి( Anudeep Kv ) దర్శకత్వం వహించిన ఈ చిత్రం తప్పుడు ఆరోపణల కింద హత్యాయత్నం కేసులో అరెస్టు అయిన ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది.ఇందులో చిట్టిగా ఫరియా అద్భుతంగా నటించింది.ఈ సినిమాతో వచ్చిన సక్సెస్ వల్ల ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా గుర్తింపు తెచ్చుకుంది.ఈ ఒక్క సినిమాతోనే ఆమెకు చాలామంది హీరోల సరసన నటించే అవకాశం దొరుకుతుందని అందరూ అనుకున్నారు కానీ అలా జరగలేదు.కనీసం చిన్న హీరో పక్కన కూడా నటించే ఛాన్స్ ఆమెకు రాలేదు.
దానికి ఒకే ఒక కారణం ఉంది.అది ఏంటంటే ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరి హీరోల కంటే ఎక్కువ హైట్ ఉంటుంది.

మన తెలుగు సినిమాలో రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్, రామ్ పోతినేని, ఆనంద్ దేవరకొండ, నాని ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అందరూ హీరోలు ఆరడుగుల కంటే తక్కువ ఎత్తు ఉంటారు.ఫరియా మాత్రం ఇంచుమించుగా ఆరడుగుల హైట్ ఉంటుంది.అందువల్ల ఆమె హీరోల పక్కన సరిగా సెట్ కావడం లేదు.అందుకే దర్శక నిర్మాతలు ఈ ముద్దుగుమ్మను హీరోయిన్ గా కన్సిడర్ చేయడం లేదు.ఆ విధంగా ఫరియా అబ్దుల్లా హైట్ ఎక్కువ కాబట్టి ఇండస్ట్రీలో సినిమాలు చేయలేక పోతుంది.జాతి రత్నాలు తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగార్రాజు, లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్, రావణాసుర, వంటి ఇతర తెలుగు చిత్రాలలో కూడా ఫరియా నటించింది.
ఇప్పుడు వల్లీ మెయిల్ మూవీ( Valli Mayil )లో నటిస్తోంది.విభిన్న శైలులు, పాత్రలలో ఆమె తన బహుముఖ ప్రజ్ఞ, ప్రతిభను కనబరిచింది.
తెలుగు సినీ పరిశ్రమలో రైజింగ్ తారలలో ఒకరైన ఈమెకు మంచి భవిష్యత్తు ఉంది.







