Lord Krishna : శ్రీ కృష్ణుడు మధురను విడిచి ద్వారకాకు ఎందుకు వెళ్తాడు..? అసలు ద్వారక ఎలా మునిగిపోయింది..?

మన దేశంలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి.కోట్లాదిమంది భక్తులు దేవాలయాలను సందర్శించి పూజలు నిర్వహిస్తుంటారు.

అయితే మనకు కనిపించే పురాతన దేవాలయాలలో గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ద్వరాకాధీష్ దేవాలయం( Dwaraka Temple ) కూడా ఒకటి.ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రతి సంవత్సరం వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వస్తూ ఉంటారు.

ద్వరాకాధీష్ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది.ఈ ఆలయం వేళ్ళ సంవత్సరాల నుండి ఇక్కడ ఉంది.

అయితే 5000 సంవత్సరాల క్రితం మధురను విడిచిపెట్టిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి రావడం జరిగింది.ఆ తర్వాత ద్వారకా నగరం శ్రీకృష్ణుని నివాసంగా ఉండేది.

Advertisement
Why Does Shri Krishna Leave Mathura And Go To Dwarka How Did Dwaraka Sink-Lord

శ్రీకృష్ణుడు ఈ ప్రదేశంలో చాలా సంవత్సరాలు గడిపారు.ఇక్కడ తన వ్యక్తిగత రాజభవనాన్ని కూడా నిర్మించాడు.

Why Does Shri Krishna Leave Mathura And Go To Dwarka How Did Dwaraka Sink

అయితే శ్రీకృష్ణుడు తన జన్మస్థలాన్ని విడిచి అక్కడికి వెళ్లడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.కృష్ణ భగవానుడి బాల్యం మధుర నగరంలో గడిచింది.కంసుడిని చంపిన తర్వాత కృష్ణుడు మధురను విడిచిపెట్టి ద్వారకకు వెళ్లి అక్కడ తన నగరాన్ని నిర్మించాడు.

అయితే కంసుడి బంధువు అయినా జరాసంధుడు( Jarasandh ) కృష్ణుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి పదే పదే మధుర పై దాడి చేయడం ప్రారంభించాడు.అయినప్పటికీ కృష్ణుడు చేతిలో 17 సార్లు ఓడిపోతూ వచ్చాడు.

ఈ క్రమంలోనే మధుర ప్రజలు ఎన్నో నష్టాలను చవిచూశారు.అయితే కృష్ణుడు నేనే కంసుడిని చంపానని కంసుడిని చంపడానికి నేనే బాధ్యత వహిస్తానని ఆత్మపరిశీలన చేసుకున్నాడు.

Why Does Shri Krishna Leave Mathura And Go To Dwarka How Did Dwaraka Sink
నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

యుద్ధంలో నష్టాలు రావడంతో మధుర రాష్ట్రం అభివృద్ధి చెందలేకపోయింది.కాబట్టి ద్వారక వదిలి వెళ్లాలని కృష్ణుడు నిర్ణయించుకున్నారు.జరాసంధుడు చావు కృష్ణుడి చేతిలో రాయలేదని కృష్ణుడికి తెలియడంతో శ్రీకృష్ణుడు యజవంశీయులందరితో కలిసి మధురం విడిచిపెట్టారు.

Advertisement

మధుర ప్రజలను కాపాడడానికి మాత్రమే శ్రీకృష్ణుడు మధురను రాత్రి సమయంలో విడిచిపెట్టాడు.ఆ తర్వాత కృష్ణుడు గుజరాత్( Gujarat ) కి వెళ్లి సముద్ర తీరంలో తన దివ్య నగరాన్ని స్థాపించాడు.

ఇక ఈ నగరానికి ద్వారకా అని పేరు పెట్టారు.అయితే మహాభారతం జరిగిన 36 సంవత్సరాల తర్వాత ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది.

తాజా వార్తలు