శృంగారం తరువాత అలాంటి వాసన ఎందుకు వస్తుంది

శృంగారం అంటే కేవలం రెండు శరీరాల కలయిక మాత్రమే కాదు, కొన్ని రసాయనాల కలయిక కూడా.కొన్ని ద్రవాల కలయిక కూడా.

ఆ కలయికలో బంధం పుడుతుంది, పిండం పడుతుంది, అలాగే కాసేపు ఒకలాంటి వాసన కూడా పుడుతుంది.ఆ వాసన ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పడం కష్టం.

శృంగారం తర్వాత విచిత్రమైన వాసన ఎందుకు వస్తుంది? ఎప్పుడు ఒకే రకమైన వాసన రాదు.అది మారుతూ ఉంటుంది.

ఎందుకు మారుతుంద? ఎలాంటి కారణాల వలన శృంగారం తర్వాత వాసన వచ్చే అవకాశం ఉంటుంది? ఆలస్యం చేయకుండా తెలుసుకోండి.* యోని నుంచి బయటకు వచ్చే ద్రవాలు ఆసిడిక్ లక్షణాలు కలిగి ఉంటాయి.

Advertisement

పురుషాంగం నుంచి బయటకు వచ్చే వీర్యం ఆల్కలైన్ లక్షణాలు కలిగి ఉంటుంది.ఈ రెండు కలవడంతో ఒకలాంటి వాసన రావచ్చు.

అదే మీరు తినే ఆహారాన్ని బట్టి మారుతూ ఉంటుంది.కొన్నిసార్లు బాగుంటే కొన్నిసార్లు భరించలేని విధంగా ఉండవచ్చు.

* కొన్ని సార్లు ఇలాంటి వాసనకు పెద్దగా సైన్సు వాడనవసరం లేదు.Hygiene సరిగా లేకపోతే, అంటే శుభ్రత సరిగా లేకపోతే భరించలేని వాసన రావచ్చు.

శరీర నిర్మాణం వలన ఇలాంటి సమస్యలు ఎక్కువగా స్త్రీలు చూస్తారు.కాబట్టి శృంగారానికి ముందు స్త్రీ పురుషులిద్దరూ తమ ప్రైవేట్ పార్ట్స్ ని శుభ్రపరుచుకోవడం ఉత్తమం.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
రోజు నైట్ ఈ క్రీమ్ రాస్తే స్పాట్‌లెస్ స్కిన్ మీసొంతం అవుతుంది!

* కొన్నిసార్లు యోని నుంచి వచ్చే లూబ్రికేషన్ సపరేటు వాసన సృష్టించవచ్చు.అలాగే పురుషుడి వీర్య కణాల వలన కూడా ప్రత్యేకమైన వాసన వస్తుంది.

Advertisement

ఇక్కడ కూడా మనిషి తినే ఆహారాన్ని బట్టి వాసన ఉంటుంది.మంచి ఆహారం తింటే తప్ప దుర్వాసన రావడం ఖాయం.

* రఫ్ శృంగారం చేసినప్పుడు యోనిలోని టిష్యూలపైన ప్రభావం పడవచ్చు.అప్పుడు యోని మంటగా, దురదగా అనిపించవచ్చు.

అలాంటి సమయాల్లో కూడా కాస్త ఇబ్బందికరంగా ఉండే వాసన వస్తుంది.* శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్ల వలన కూడా వాసన రావచ్చు.

పురుషుడి శరీరంలో ఇన్ఫెక్షన్ అంటే అది వీర్య కణాల ద్వారా స్త్రీ శరీరంలోకి కూడా వెళ్లవచ్చు.యోని లోంచి వచ్చే డిశ్చార్జ్ వలన కూడా వాసన ఉంటుంది.

* కారణాలు పెద్దగా లేకుండా వాసన విపరీతంగా వస్తుంది అంటే అది ఏదైనా సుఖవ్యాధి కి సూచన కావచ్చు.సుఖ వ్యాధి ఉన్నవారి శరీర ద్రవాల లోంచి భరించలేని వాసన వస్తుంది.

తాజా వార్తలు