పూజలో గంట ఎందుకు మోగిస్తారు?  

Why Do We Ring The Bell In A Temple -

భగవంతునికి ఆహ్వానం పలకడానికి గంట మోగిస్తారు.మనం చేసే ఉపచారాలకు స్వామిని లేదా అమ్మవారిని అభిముఖం చేసే ప్రయత్నమే ఘంటారావం.

దేవాలయం లోకి ప్రవేశించగానే ముందు ఘంటారావం చేసి భగవంతుని దర్శించుకోవటానికి కూడా ఇదే కారణం.అంతే కాకుండా చుట్టూ ఉన్న భూత పిశాచాలకూ, దుష్ట శక్తులకు దేవుని పూజ మొదలైందనీ, ఇంక ఆ చోట వాటికి స్థానం లేదనీ హెచ్చరికగా కూడా గంట వాయిస్తారు.

Why Do We Ring The Bell In A Temple-Devotional-Telugu Tollywood Photo Image

శక్తి కొద్దీ ఆర్భాటంగా ఖరీదైన లోహాలతో చేసిన గంటలను చూస్తుంటాం.కానీ ‘కంచు మ్రోగునట్లు కనకంబుమ్రోగునా’ అన్న నానుడి ఈ విషయం లో వర్తిస్తుంది.

భగవంతుడికి కంచు గంట శ్రేష్ఠం.

శివునికైతే నంది గంట (నంది ఆకారం చెక్కబడిన గంట), విష్ణువుకైతే ఆంజనేయుడు లేదా గరుత్మంతుడు చెక్కబడిన గంటలు ఉపయోగించాలి.

వినాయకుడు, శృంగి, శంఖ చక్రాదులు ఇలా రకరకాలైన స్వరూపాలు గల గంటలు అందుబాటులో ఉన్నాయి.రోజువారీగా ఇంట్లో పూజించేటప్పుడు ఈ భేదం పాటించాల్సిన అవసరం లేదు.

Why Do We Ring The Bell In A Temple- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Why Do We Ring The Bell In A Temple-- Telugu Related Details Posts....

DEVOTIONAL