ప్రపంచ దేశాలతో పోలిస్తే చైనా దేశం చాలా విషయాల్లో భిన్నంగా ఉంటుంది.ఇతర దేశాల వస్తువుల ఒరిజినల్ ను మరిపించేలా డూప్లికేట్ ను తయారు చేసే చైనా అలవాట్ల విషయంలో ఇతర దేశాలకు భిన్నంగా ఉంటుంది.
ఇతర దేశాలతో పోలిస్తే చైనా ప్రజలు ఎక్కువ శ్రమ చేస్తూ తక్కువ వేతనం పొందుతుంటారు.అందువల్లే చైనా ఇతర దేశాలకు తక్కువ ధరకే వస్తువులను అందించగలుగుతుంది.
చైనా ఆహారపు అలవాట్లు సైతం భిన్నంగా ఉంటాయి.పాములు, కప్పలు, ఎలుకలు, పురుగులు కాదేదీ తినడానికి అనర్హం అనే విధంగా అన్ని రకాల జీవులను తినడానికి చైనీయులు ప్రాధాన్యతనిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా వైరస్ విజృంభించడానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే చైనా ఆహారపు అలవాట్లే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
సాధారణంగా మనుషులు జంతువులను తింటారనటంతో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
అయితే చైనీయులు పురుగులను సైతం వదలకుండా తినడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలే ఉన్నాయి.చైనీయులకు దేనినైనా వృథా చేయడం అంటే అస్సలు నచ్చదు.
భౌద్దులు ఏ జీవి చనిపోయినా దానిని వృథా కాకుండా ఆహారంగా తీసుకొని కడుపు నింపుకోవాలని భావించేవారు.
భౌద్దులు అనుసరించిన విధానాన్నే చైనీయులు సైతం ఫాలో అవుతున్నారు.
అమెరికాలో స్థిరపడిన చైనా వ్యక్తి జోసెఫ్ వాసెంగ్ చైనీయులకు జంతువులను తినడం క్రమంగా అలవాటుగా మారిందని వెల్లడించాడు.కొన్ని జంతువుల్లో ఔషధ గుణాలు ఉంటాయని చైనీయులు నమ్ముతారని అందుకే ఏ జీవినీ వదలకుండా తింటారని చెప్పారు.
జంతువు కాళ్లు తింటే మన కాళ్లు, జంతువు మెదడు తింటే మన మెదడు పదునుగా పని చేస్తాయని చైనీయులు నమ్ముతారని … అయితే చైనీయులంతా ఇలాంటి ఆహారం తీసుకోరని వాంగ్ వెల్లడించారు.చైనాలోని ధనవంతులు మాత్రమే కోతులు, గబ్బిలాలు లాంటి జంతువులను తింటారని పేర్కొన్నారు.