డబ్బులు ఉంటే ఒక సినిమా తీయడం పెద్ద విషయమే కాదు మార్కెట్లో వస్తున్న మంచి కథలను ఆధారంగా చేసుకుని సినిమాలను విజయవంతం చేసుకోవడం కూడా పెద్ద ప్రొడక్షన్స్ కి చిటిక వేసినంత పని.సినిమా తీయాలి అంటే సాధారణ వ్యక్తులకు ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి కానీ దిల్ రాజు ( Dil raju )లాంటి ఒక ప్రొడ్యూసర్ కి ఎలాంటి సమస్యలు ఉండవు ఎంత పెద్ద సినిమా అయినా ఎన్ని వందల కోట్ల బడ్జెట్ అయినా పెట్టే కెపాసిటీ వారి సొంతం.
అలాగే విడుదలవుతున్న సమయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన నిమిషాల్లో దాన్ని సరిదిద్దుకోగలరు.అలాంటి దిల్ రాజు ఇంట్లో ఈ మధ్యకాలంలో ఒక హీరో ఉన్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే.
అతడు మరెవరో కాదు దిల్ రాజు సోదరుడి కుమారుడైన ఆశిష్ రెడ్డి ( Ashish Reddy )మొట్టమొదటగా రౌడీ బాయ్స్ ( Rowdy boys )అనే సినిమాతో 2022లో తొలిసారిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.ఈ సినిమా అస్సలు ఆడలేదు.అయితే కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే హీరోగా ఒక మంచి ప్రయత్నమైతే చేశాడు అనే పేరు దక్కించుకున్న ఆశిష్ ఆ తర్వాత సెల్ఫిష్ అనే పేరుతో మరో చిత్రంలో హీరోగా నటించిన అది కూడా ఆశిష్ రెడ్డికి నిరాశ నే మిగిల్చింది.ఇక ముచ్చటగా మూడోసారి ఒక థ్రిల్లర్ కాన్సెప్ట్ తో లవ్ మీ ( love me )అనే టైటిల్ పెట్టి ఆశిష్ రెడ్డి హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా మరో సినిమా వస్తోంది.
ఇక ఈ మూడవ సినిమా అయినా విజయం సాధించి ఆశీష్ రెడ్డికి ఒక విజయాన్ని ఇస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
అయితే ఆశిష్ రెడ్డికి ప్రస్తుతం వయసు 33 ఏళ్లు.ఈ సమయంలో ఒక పెద్ద హీరో అయిపోతాననే కలలు కంటున్నారా ఎంటి అని అంటున్నారు కొంతమంది గాసిప్ రాయుళ్లు.ఎందుకంటే తండ్రి, పెదనాన్న దగ్గర బోలెడంత డబ్బు ఉంది కాబట్టి ఎలాంటి సినిమా అయినా తీసేసి ఇండస్ట్రీలో రాణించొచ్చు అనుకుంటున్నాడా ఏంటి అనీ వినిపిస్తుంది.
డబ్బు ఉంటే సరిపోదు నటించడం కూడా తెలియాలి అది లేకుండా విజయాలు ఎలా దక్కుతాయి అనే ప్రశ్న కూడా ఎదురవుతుంది.మరి ఈ సవాల్లను ఎదుర్కొని ఆశిష్ రెడ్డి ఒక స్థాయికి ఎదుగుతాడా లేదా అనేది కొన్నాను వేచి చూస్తే తెలుస్తుంది .ఇక ఇటీవల ఆశిష్ రెడ్డి వివాహం చేసుకున్న సంగతి కూడా మనకు తెలిసిందే.