మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) కొడుకు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ( Ram Charan )చాలా తక్కువ సమయం లోనే ఇండస్ట్రీలో తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని ముందుకు సాగుతున్నాడు.ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.
ఇక చిరుత సినిమా నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా రేంజ్ లో తనదైన రీతిలో సినిమాలు చేస్తు ముందుకు సాగుతున్నాడు.

ఇక ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ ( Shankar )లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.ఇక దానికి తగ్గట్టుగానే మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశ్యం తోనే వరుస కథలను వింటూ సినిమాల కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక శంకర్ తో పాటు గా బుచ్చిబాబు డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా తొందర్లోనే రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక మొత్తానికైతే రామ్ చరణ్ పాన్ ఇండియా లో భారీ సినిమాలు చేస్తూ భారీగా తన క్రేజ్ ను విస్తరింప చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’( Aravinda Sametha Veera Raghava ) సినిమాను త్రివిక్రమ్ మొదటగా రామ్ చరణ్ తో చేయాలని అనుకున్నాడట.

కానీ అప్పుడు కొన్ని అనివార్య కారణాలవల్ల రామ్ చరణ్ ఆ సినిమాను చేయలేకపోయాడు.ఇక దానివల్ల త్రివిక్రమ్ ఈ సినిమాని ఎన్టీఆర్ తో చేసి సక్సెస్ ను అందుకున్నాడు.ఇక త్రివిక్రమ్ రామ్ చరణ్ కాంబో లో ఇంతవరకు అయితే ఒక్క సినిమా కూడా రాలేదు.
ఫ్యూచర్ లో ఒక మంచి కథ ఒక సూపర్ హిట్ సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తుంది.