90 వ దశకం లో హీరో గా తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్న చిరంజీవి ( Chiranjeevi )వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక వీళ్ల కాంబో లో ఎక్కువ హిట్లు కొట్టడమే కాకుండా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమం లోనే చిరంజీవికి పోటీగా చాలామంది ఇతర భాష హీరోలు ఎదుగుతున్న క్రమంలో సౌత్ ఇండియా లో చిరంజీవికి రజినీకాంత్, మోహన్ లాల్, మమ్ముట్టి, కమలహాసన్ ( Rajinikanth, Mohanlal, Mammootty, Kamala Haasan )లాంటి స్టార్ హీరోలతో భారీ పోటీ అయితే ఎదురైంది.అయినప్పటికీ చిరంజీవి ఎప్పటికప్పుడు వాళ్ళ పోటీని తిప్పికొడుతూ తను ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు.అయితే రజనీకాంత్ చిరంజీవి కొంతవరకు టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికి రజనీకాంత్ ను కూడా పక్కన పెట్టేసి సౌత్ లో చిరంజీవి నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు.నిజానికి వాళ్ళందరిలో లేని క్వాలిటీ చిరంజీవి ఉన్నా ఒక క్వాలిటీ ఏంటంటే డ్యాన్స్… చిరంజీవి బ్రేక్ డాన్స్ ని గ్రేస్ తో చేస్తూ ప్రేక్షకుల నుంచి విజిల్స్ పడేలా చేస్తాడు.
అందువల్లే ఆయనకి అంత క్రేజ్ అయితే పెరిగింది.
ఈజీగా అయితే ఆయన మెగాస్టార్ గా ఎదగలేదు.దాని వెనక ఎన్నో రాత్రుల కృషి పట్టుదల ఉంది.అయినప్పటికీ చాలా మంది హీరోలు తనని తొక్కేయాలని వాళ్ళ సినిమాలతో పైకి ఎదగాలని ప్రయత్నం చేశారు.
కానీ సినిమాల పరంగానే చిరంజీవి వాళ్లందరికీ సమాధానం చెబుతూ వచ్చాడు.ఇక ఎప్పటికప్పుడు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ మెగాస్టార్ గా ఎదిగిన వైనం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఒక కామన్ మ్యాన్ మెగాస్టార్ గా ఎదగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
.