రాజమౌళి కొడుకు కార్తికేయ ఎందుకు డైరెక్టర్ కాలేదంటే..?

దర్శక ధీరుడు రాజమౌళి( Rajamouli ) కొడుకు అయిన కార్తికేయ ఎందుకు డైరెక్టర్ కాలేకపోయాడు అంటే ఆయనకి డైరెక్షన్ మీద అసలు ఇంట్రెస్ట్ లేదనే చెప్పాలి.

అందుకే ఈయన రాజమౌళి చేసే అన్ని సినిమాలకి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్ని తనే దగ్గరుండి చూసుకుంటాడు.

అందుకే ప్రతి క్రాఫ్ట్ లో తను కూడా ఇన్వల్వ్ అవుతూ ఉంటాడు.ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో చేస్తున్న సినిమాలో కూడా తన ఇన్వాల్వ్ మెంట్ చాలా పెద్దదనే చెప్పాలి.

ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాకోసం అయితే ఒక వైపు లైన్ ప్రొడ్యూసర్ గా ఉంటూనే మరో వైపు హీరోలకి దగ్గరుండి వాళ్ళకి ఏం కావాలి ఇవాళ్ళ జరిగే షూట్ కి వాళ్ల కాస్ట్యూమ్స్ ఏంటి అనే విషయాలన్నింటినీ తనే దగ్గర ఉండి చూసుకునే వాడు.రాజమౌళి ని ఒకసారి మి అబ్బాయి ని డైరెక్టర్ ని చేయరా అని అడిగితే దానికి సమాధానం గా లేదు వాడు మంచి బిజినెస్ మ్యాన్ అవుతాడు వాడికి బిజినెస్ ఎలా చేయాలి అనే విషయాల మీద మంచి క్లారిటీ ఉంది.మా కుటుంభం లో ఎవరికి లేని ఆ డబ్బులని పొదుపు చేసే అలవాటు వాడికి మాత్రమే ఉంది అందుకే వాడిని మేము డైరెక్షన్ చేయి అని ఫోర్స్ చేయడం లేదు అని చెప్పాడు.

ప్రస్తుతం రాజమౌళి తో పాటు మహేష్ బాబు( Mahesh Babu ) సినిమాకోసం లొకేషన్స్ చూసే పనిలో ఉన్నాడు కార్తికేయ( Karthikeya ).ఈయన లేకపోతే రాజమౌళి టీమ్ చాలా వీక్ అవుతుందని ఆయనని దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు.ఇక రాజమౌళి భార్య రమా రాజమౌళి గురించి మనందరికీ తెలిసిందే రాజమౌళి సినిమాలన్నిటికి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తుంది.

Advertisement

ఇక రాజమౌళి వాళ్ల అన్నయ్య కీరవాణి ఆయన సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటాడు అనే విషయం మనకు తెలిసిందే.

వైరల్ వీడియో : రేవ్ పార్టీలో యాక్టర్ రోహిణి నిజంగానే దొరికిందా లేక ప్రాంకా..?
Advertisement

తాజా వార్తలు