అదిగో ఇదిగో అనడమేనా ? కమిటీల గురించి పట్టించుకోరా ?

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ లో ఎప్పుడూ ఏదో ఒక లొల్లి తెర మీదకు వస్తూనే ఉంటుంది.ఇప్పటికే అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉన్న టీఆర్ఎస్ అధిష్టానానికి పార్టీలో కమిటీల నియామకాలు పెద్ద తలనొప్పిగా మారాయి.

 Why Cm Kcr Delay Trs Party Party Committees-TeluguStop.com

ఒక పక్క చూస్తే మున్సిపల్ ఎన్నికలు తరుముకొస్తున్నాయి.ఇదే సమయంలో తమ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ దేశవ్యాప్తంగా బలపడడంతో పాటు అన్ని వర్గాల ప్రజలతోనూ శభాష్ అనిపించుకోవడం కేసీఆర్ కు నచ్చడంలేదు.

ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికలకు వెళ్తే చేదు ఫలితాలు వస్తాయనే ఆలోచనలో పడ్డాడు.ఇక ఇప్పుడు పార్టీలో కమిటీల నియామకాలు మరో కొత్త తలనీప్పిగా మారడం ఖాయం అనే అభిప్రాయంలో టీఆర్ఎస్ అధిష్టానం ఉంది.

ఇప్పటికే పార్టీ తరపున కమిటీలు నియామకం ఆలస్యం చేయడంతో ఎవరు మాట్లాడాలో అధికారిక ముద్ర లేక మౌనంగా ఉండిపోతున్నారు.వీలైనంత తొందరగా కమిటీల నియామకం చేపడితే ప్రత్యర్థుల మీద తమ వాక్చాతుర్యంతో విరుచుకుపడతామంటూ ఈ పదవులు ఆశిస్తున్న నాయకులు చెబుతున్నారు.

అసలు టీఆర్ఎస్ అధిష్టానం పార్టీల కమిటీల ప్రకటన ఎందుకు ఆలస్యం చేస్తుందో అన్న విషయం తెలియక చాలామంది సతమతం అయిపోతున్నారు.నిత్యం పార్టీ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండే నాయకులు, ఇప్పుడేం చేయాలో అర్థంకాక ఇంటికే పరిమితం అయిపోతున్నారు.

దీనంతటికీ కారణం కమిటీల నియామకంలో కాలయాపన చేయడమేనట.గతంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి అవ్వగానే, వెంటనే పార్టీ రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి కమిటీలను నియమించుకునేది.

రాష్ట్రస్థాయి నాయకులు హైదరాబాద్ కేంద్రంగా పార్టీ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడుపుతుండేవారు.ఇక పార్టీ అధికార ప్రతినిధులు కూడా నిత్యం మీడియా డిబేట్లతో పార్టీ తరపున గొంతు గట్టిగా వినిపించేవారు.

తమ ప్రత్యర్థి పార్టీల నాయకులు వేసిన కౌంటర్లకి దిమ్మ తిరిగే సమాధానాలు ఇచ్చేవారు.కానీ ప్రస్తుతం మీడియాలో టీఆర్ఎస్ తరపున వాయిస్ ఇచ్చేవాళ్లే కనిపించడంలేదు.

-Telugu Political News

పంచాయతీరాజ్ శాఖపై మంత్రులు, అధికారులతో కేసీఆర్ సమీక్ష పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన పార్టీ కేసీఆర్ అదేరోజు పార్టీ కమిటీలను రద్దు చేసినట్టుగా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.అధికార ప్రతినిధులు ఎవరూ ఆ రోజు నుంచి టీవీ చర్చా కార్యక్రమాలకు వెళ్ళడానికి వీల్లేదంటూ ఆదేశాలు ఇచ్చాడు.దీంతో అధికార ప్రతినిధులు ఎవరూ కూడా పార్టీ కార్యక్రమాలకు, టీవీ చర్చలకు హాజరుకావడంలేదు.కేవలం టీవీ చర్చలకు కాంగ్రెస్, బిజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నేతలు మాత్రమే హాజరవుతున్నారు.

అసలు పార్టీ ఎప్పుడు అధికార ప్రతినిధుల జాబితా విడుదల చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు.అసలు వచ్చే లిస్టులో తమ పేర్లు ఉంటాయా అనే ఆందోళన గులాబీ నేతల్లో కనిపిస్తోంది.

అయితే మున్సిపల్ ఎన్నికల ముందు విడుదల చేస్తారని కొంతమంది, ఆ ఎన్నికల తరువాత అని మరికొంతమంది ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు.కానీ అధిష్టానం మాత్రం ఏ విషయం తేల్చకుండా నాన్చుడు ధోరణితో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube