మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా కొణిదెల ప్రొడక్షన్ లోనే సినిమాలు చేస్తూ వచ్చాడు.ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య మాత్రం మైత్రి మూవీ మేకర్స్ తో చేశాడు.
ఈ సినిమా మెగా మేనియా ఎలా ఉంటుందో మరోసారి చూపించింది.మధ్యలో వచ్చిన ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు నిరాశపరచగా వాల్తేరు వీరయ్య మెగాస్టార్ స్టామినా ఏంటో చూపిస్తుంది.
సరైన సినిమా పడితే చిరు బాక్సాఫీస్ సునామి ఎలా ఉంటుందో వాల్తేరు వీరయ్య వసూళ్లు చూస్తే అర్ధమవుతుంది.
ఇదిలాఉంటే చిరు రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మెగా బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు.
అల్లు అరవింద్ అడిగితే చిరు కాదనే ఛాన్స్ లేదు మరి అల్లు అరవింద్ చిరుని అడగలేదా అడిగినా చిరు వద్దన్నాడా అన్నది తెలియదు కానీ.గీతా ఆర్ట్స్ లో చిరు సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.
అయితే అల్లు అరవింద్ ఈమధ్య పెద్ద సినిమాలు చేయడం మానేశాడు.

లో బడ్జెట్ సినిమాలతో నెట్టు కొట్టుస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమాలో భాగస్వామ్యం అయ్యాడు.మరి చిరుతో సినిమా ప్లాన్ చేస్తాడా లేక అలానే చిన్న బడ్జెట్ సినిమా చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.
చిరు సినిమాల లైనప్ లో కూడా ఎక్కడ గీతా ఆర్ట్స్ ప్రస్తావన లేదు.సో ఇప్పట్లో ఆ బ్యానర్ లో చిరు సినిమా అవకాశం లేదని తెలుస్తుంది.







