బాలయ్య-కోడి రామ‌కృష్ణ‌ హిట్ కాంబో.. సడెన్ గా ఆపేయడం వెనక ఇంత కారణం ఉందా?

కోడి రామ‌కృష్ణ‌ తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ దర్శకుడు.ఆయన తీసిన ఎన్నో సినిమాలు కొత్త రికార్డలను క్రాయేట్ చేశాయి.

ఆయన చాలా మంది హీరోలతో కలిసి పని చేసినా.బాల‌కృష్ణతో చేసిన సినిమాలకు ఎదురు లేదని చెప్పుకోవచ్చు.

వీరి కాంబోలో వచ్చిన సినిమాలు అద్భుత విజయాలను అందుకున్నాయి.వీరిద్దరి కాంబో అనగానే ముందుగా గుర్తొచ్చే సినిమాలు మంగమ్మ గారి మ‌న‌వ‌డు, ముద్దుల కృష్ణ‌య్య‌, మువ్వ‌గోపాలుడు, ముద్దుల మావ‌య్య.

ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.చాలా కాలం పాటు కలిసి సినిమాలు చేసిన వీరిద్దరు అకస్మాత్తుగా సినిమాలు చేయడం మానేశారు.

Advertisement

ఎందుకు వీరు అలా చేశారు? అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.వాస్తవానికి రామ‌కృష్ణ‌, బాలయ్య కాంబోలో వచ్చిన నాలుగు సూపర్ హిట్సినిమాలను భార్గ‌వ్ ఆర్ట్స్ అధినేత యస్‌.

గోపాల్‌రెడ్డి నిర్మించారు.ఆ తర్వాత వీరు ముగ్గురు కలిసి ఓ జానపద సినిమాను మొదలు పెట్టారు.

కారణాలు ఏంటో తెలియదు కానీ.ఆ సినిమా సగం షూటింగ్ అయ్యాక ఆగిపోయింది.

అప్పటి నుంచి బాలయ్య, కోడి కాంబోలో సినిమాలు రాలేదు.అయితే ఎందుకు రాలేదు అనే విషయాన్ని ఓ సారి రామ‌కృష్ణ‌ వెల్లడించాడు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..

భార్గ‌వ్ ఆర్ట్స్‌లో బాల‌య్య‌తో మంచి సినిమాలు చేసినట్లు చెప్పాడు.

Advertisement

మంగమ్మ గారి మనువడు సినిమాతో బాలయ్యకు మంచి క్రేజ్ వచ్చిందన్నాడు.ఆ తర్వాత బాలయ్యతో ఏ సినిమా చేసినా నిర్మాత గోపాల్ రెడ్డి అడగకుండానే రెమ్యునరేషన్ పెంచినట్లు చెప్పాడు.దాదాపు బాలయ్య ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో టాప్ హీరో అయ్యాడు.

ఆ పరిస్థితుల్లో బాలయ్యతో సినిమా చేస్తే మనకోసం ఆయన పారితోషకం తగ్గించుకోవాలి.అలాంటి పరిస్థితి బాలయ్యకు రాకూడదు.

అందుకే ఆయనకు పారితోషకం ఇచ్చే స్థాయికి మనం చేరుకున్నప్పుడే ఆయనతో సినిమాలు చేద్దాం అని గోపాల్ రెడ్డి చెప్పినట్లు వెల్లడించాడు.అందుకే ఆ తర్వాత బాలయ్యతో సినిమాలు చేయలేదని చెప్పాడు.

అటు తమ కాంబోలో ఓ సినిమా మొదలై ఎందుకు ఆగిపోయిందో కూడా చెప్పాడు కోడి రామ‌కృష్ణ.కొందరు మధ్యవర్తుల కారణంగానే ఆ సినిమా ఆగిపోయినట్లు చెప్పాడు.ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సిన విషయం ఏమీ లేదన్నాడు.

వాస్తవానికి ఆ సినిమా 60 శాతం అయిపోయినట్లు వెల్లడించాడు.అదే సమయంలో గోపాల్ రెడ్డిగారు చనిపోయారని చెప్పాడు.

ఒకవేళ తను బతికి ఉంటే ఈ సినిమా చేసే వాళ్లమని చెప్పాడు.లెజెండరీ దర్శకుడు కోడి 2019 ఫిబ్ర‌వ‌రి 22న‌ చనిపోయారు.

తాజా వార్తలు