దుష్టచతుష్టయంతో నిత్యం యుద్ధం చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించిన ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు.
గత ప్రభుత్వ విధానం డీపీటీ అన్న దోచుకో.పంచుకో.
తినుకో అని ఎద్దేవా చేశారు.గత ప్రభుత్వ డీపీటీ విధానాన్ని ప్రజలు గుర్తు తెచ్చుకోవాలని తెలిపారు.
ఈ నేపథ్యంలో మీ బిడ్డ దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాడని జగన్ పేర్కొన్నారు.తమ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయకపోతే పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని ప్రశ్నించారు.
తోడేళ్లని ఎందుకు ఏకమవుతున్నాయని నిలదీశారు.కుట్రపూరితంగానే వైసీపీ ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని విమర్శించారు.