Phone లో నంబర్స్ పైనుండి కిందకి ఉంటే..! calculator , Computer లో కిందనుండి పైకి ఎందుకు ఉంటాయో తెలుసా..?

మనకి కంప్యూటర్ వాడటం ఎప్పటినుండో అలవాటే కదా…అలాగే ఫోన్ కూడా మనం కూడా ఒక రేంజ్ లో వాడేస్తుంటాము.టెక్నాలజీ కాలంలో ఇవన్నీ చాలా కామన్ కదా.

 Why Are The Numbers On A Calculator And A Phone Reversed-TeluguStop.com

అలాగే మనం చిన్నప్పుడు calculations చేయండని calculator ఉపయోగించే వాళ్ళము గుర్తుందా.? అంతెందుకు ఇంజనీరింగ్ లో కూడా scientific calculator ఉపయోగించము.ఇప్పుడు అసలు మేటర్ ఏంటంటే.ఫోన్, calculator , కంప్యూటర్ కీ బోర్డు లో ఉండే నంబర్స్ ఒకసారి చూడండి.

ఫోన్ లో నంబర్స్ పైనుండి కిందకి ఉన్నాయి.కానీ calculator , కంప్యూటర్ కీ బోర్డు లో మాత్రం కింద నుండి పైకున్నాయి.! అలా ఎందుకు ఉన్నాయో తెలుసా.?

మీకు అసలు కారణం తెలియాలి అంటే…calculator రాకముందు కాలంకి వెళ్ళాలి.మెకానికల్ కాష్ రిజిస్టర్ లను ఉపయోగించేవారు ఆ రోజుల్లో.అందులో o కింద ఉంటె…మిగిలిన నంబర్స్ 1 , 2 , 3 ….

అన్ని పైకి ఉండేవి.ఎందుకంటే సున్నా సంఖ్యను ఎక్కువగా ఉపయోగించేవారు కాబట్టి.

సునాయాసంగా ఉపయోగించడానికి అలా డిజైన్ చేసారు.తర్వాత మెకానికల్ calculator చేసినప్పుడు కూడా “0 ” కింద పెట్టి “9 ” చివర్లో పైన పెట్టారు.

తర్వాత ఎలక్ట్రానిక్ calculator కనిపెట్టారు.మెకానికల్ calculator కాన్సెప్ట్ నే ఇందులో కూడా ఫాలో అయ్యారు.అదే పాటర్న్ ఇప్పుడు కూడా వాడుతున్నారు.

మరి calculator లాగానే ఫోన్ కి ఎందుకు ఫాలో అవ్వలేదు.? ఎందుకు చేంజ్ చేసారు.?
మొదట్లో రొటేటింగ్ డయల్ ఉండే ఫోన్స్ ఉండేవి గుర్తుందా.? 1 – 9 వరకు హోల్స్ ఉండేవి.తర్వాత 0 ఉండేది.

ఏ నెంబర్ డయల్ చేయాలంటే ఆ నెంబర్ దగ్గర వేలుతో చివరి వరకు తిప్పాలి.
.

1960 లో టెలిఫోన్ కీప్యాడ్ మారుద్దాము అనుకున్నారు.అందుకే రొటేటింగ్ ది తీసేసి.

ప్రెస్ చేసే బటన్స్ డయల్ పెట్టారు.రకరకాల పాటర్న్ లు పెట్టి వినియోగించే వారందరి అభిప్రాయాలూ తీసుకొని నంబర్స్ పై నుండి కిందికి ఉంటేనే మనుషులకి బాగా నచ్చుతుంది అని అర్ధమయ్యి.3 * 3 పాటర్న్ లో పైనుండి కిందకి నంబర్స్ ఫోన్ పాడ్ చేసారు.ఇప్పుడు టచ్ ఫోన్ లో కూడా అదే ఫాలో అవుతున్నారు!

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube