ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఆంధ్ర ప్రజలకు టీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని ప్రజలు మర్చిపోరన్న ఆయన.
ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు.తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలపై మాట్లాడరా అంటూ ప్రశ్నించారు.
కేసీఆర్ తో చంద్రబాబు, జగన్ కు ఉన్న లాలూచీ ఏంటని నిలదీశారు.ఏపీకి ఇవ్వాల్సిన బిల్లులు చెల్లించిన తర్వాతనే బీఆర్ఎస్ రాష్ట్రంలో అడుగు పెట్టాలని చెప్పారు.
అంతేకాకుండా రాజధాని పేరుతో డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.అమరావతి అభివృద్ధి జరగాలన్న చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటారంటూ ఎద్దేవా చేశారు.
మరోవైపు అమరావతిలోనే ఉంటానన్న జగన్ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.విశాఖలో వైసీపీ భూదందాలు చేస్తోంది తప్ప మరోటి లేదని విమర్శించారు.