తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని జోనర్స్ వచ్చినా కూడా ఎప్పటికీ అందరిని ఆకర్షించే జోనర్ మాత్రం థ్రిల్లర్ మాత్రమే.ఎప్పుడూ కొత్త థ్రిల్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తూనే ఉంటారు.
అందుకే హర్రర్ తో కూడిన థ్రిల్లర్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.ఈ విషయాన్ని బాగా అవగాహన చేసుకున్నాడు దర్శకుడు రవిబాబు.
అందుకే ఒకదాని తర్వాత ఒకటి థ్రిల్లర్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలను మాత్రమే తీస్తూ వస్తున్నాడు.ఆయన తీసిన అనసూయ చిత్రం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా కమర్షియల్నా కూడా విజయం సాధించింది దీని తర్వాత తీసిన అమరావతి చిత్రం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి.
దక్షిణ కొరియాలో వచ్చిన H అనే మూవీకి రీమేక్ గా అమరావతి సినిమాను తెలుగులో తీశారు రవిబాబు.ఈ చిత్రంలో స్నేహ, తారక రత్న వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించగా విలన్ గా తారక రత్న చాలా చక్కగా నటించాడు.ఇక ఈ సినిమా లో తారకరత్న( Taraka Ratna ) నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.ఆయన మొదలైనప్పుడు ఏకంగా ఒకేరోజు 9 సినిమాలు మొదలయ్యాయట.కానీ ఆ తర్వాత హీరోగా నిలదొక్కు కోవడంలో విఫలమయ్యాడు.కానీ నటుడుగా ఒకేసారి ఎన్నో మెట్లు ఎక్కాడు తారకరత్న ఈ చిత్రం తర్వాత.
ఆయనలోని నిజమైన నటుడుని ఈ సినిమా ద్వారానే ప్రేక్షకులు గుర్తించారు.
ఈ సినిమాకి నిజమైన ప్లస్ పాయింట్స్ ఏమిటి అంటే కథ, మంచి టేకింగ్, ఇంట్రెస్టింగ్ లైన్, అలాగే తారకరత్న నటన తో పాటు రవి బాబు( Ravi Babu ) దర్శకత్వం.ఎలాంటి కథ అయినా సరే రవి బాబు తన సొంత స్క్రిప్ట్ వర్క్ చాలా బాగా చేస్తాడు అందుకే అతడి సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి.ఒరిజినల్ కన్నా కూడా రవిబాబు తీసిన అమరావతి సినిమా చాలా ఎక్కువ రేట్లు బాగుంటుంది.
మీరు కూడా కుదిరితే ఈసారి దక్షిణ కొరియాలోని H సినిమా చూడండి ఆ తర్వాత అమరావతి సినిమా చాలా గొప్పగా కనిపిస్తుంది.