తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం పాన్ ఇండియాలో ఐకాన్ స్టార్ గా తన సత్తా చూపిస్తున్నాడు.ఇక ఇప్పటికే ఆయన పుష్ప సినిమాతో తనదైన రేంజ్ లో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 టీజర్( Pushpa 2 Teaser ) కి సంబంధించి అశేషమైన స్పందన లభిస్తుంది.ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమాతో అల్లు అర్జున్ భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకోబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత మలయాళం లో అల్లు అర్జున్ క్రేజ్ మరింత భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.ఇక ఇప్పటికే అల్లు అర్జున్ ను మలయాళం లో మల్లు అర్జున్ అని పిలుచుకునే ప్రేక్షకులు అక్కడ ఉండే లోకల్ హీరోలను సైతం పక్కనపెట్టి స్టార్ హీరోగా మార్చబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా వచ్చిన తర్వాత మోహన్ లాల్, మమ్ముట్టి( Mohanlal, Mammootty ) లాంటి సూపర్ స్టార్లను కూడా పక్కన పెట్టి అక్కడ నెంబర్ వన్ హీరోగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక మలయాళంలో ఉన్న సినీ అభిమానులు అల్లు అర్జున్ మీద అమితమైన ఇష్టాన్ని చూపిస్తున్నారు.ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో మలయాళం లో మరోసారి తన సత్తా చూపించి అక్కడ నెంబర్ వన్ హీరోగా కొనసాగడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో తనను తాను స్టార్ హీరోగా రిప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది…
.