Bhanu Sri Mehra : సినిమాల్లో బిజీ అవ్వాలని భాను శ్రీ మెహ్రా ఇంత పని చేసిందా ?

భాను శ్రీ మెహ్రా( Bhanushree Mehra )… అల్లు అర్జున్ వరుడు సినిమా( Varudu )తో తొలిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది భాను.కానీ కొన్ని కారణాలవల్ల ఆ సినిమా పరాజయం పాలవడంతో మరో సినిమాలో కనిపించకుండా పోయింది.

 Why Allu Arjun Blocked Bhanu Sri Mehra-TeluguStop.com

హీరోయిన్ గా ఎంతో భవిష్యత్తు ఉంటుందని భావించిన భాను ఆ సినిమా తోనే తన భవిష్యత్తు పేక మెడల కూలిపోతుందని ఊహించలేదు.ఈ చిత్రం తర్వాత ఏవో అడపాదడపా ఒకటి రెండు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో నటించిన కూడా అవి ఆమె కెరియర్ కు ఏ విధంగానూ ఉపయోగపడలేదు.

ఇలా ఒక వరుడు సినిమా వల్ల స్టార్ హీరోయిన్ కావల్సిన భాను కెరియర్ లేకుండా ప్రస్తుతం ఖాళీగా ఉంటుంది.అయితే ఆమె ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని తన దినచర్యలను అందులో అప్డేట్ చేస్తూ బాగానే పాపులారిటీ సంపాదించుకుంటుంది.

Telugu Allu Arjun, Bhanu Sri Mehra, Tollywood, Varudu-Movie

అయితే తాజాగా అల్లు అర్జున్( Allu Arjun ) తనను బ్లాక్ చేశారు అంటే ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టి అందరిని షాక్ గురిచేసింది భాను.ఆ తర్వాత ఒక గంటకే శుభవార్త వచ్చింది అల్లు అర్జున్ నన్ను అన్బ్లాక్ చేశాడు, నా కెరియర్ పోవడానికి నేను అతడిని నిందించడం లేదు అంటూ చెబుతోంది.ఈ సంఘటన తర్వాత అల్లు అర్జున్ భానుని ఎందుకు బ్లాక్ చేశాడు అనే అనుమానం అందరిలో మొదలయ్యింది.ఆమె పోస్ట్ పెట్టగానే ఎందుకు అన్ బ్లాక్ చేయాల్సి వచ్చింది అనే విషయాలపై పలువురు సోషల్ మీడియా వేదిక( Social media )గా స్పందిస్తున్నారు.

సరే కారణాలు ఏమైనా వరుడు సినిమా ద్వారానే భాను కెరియర్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.అల్లు అర్జున్ బ్లాక్ చేయడానికి కారణాలు తెలియదు, ఇప్పుడైతే భాను ఖాళీగానే ఉంటుంది అయితే ఆమె భవిష్యత్తులో బిజీ అవ్వాలన్న కోరికను ఈ పోస్ట్ ద్వారా వెల్లడించినట్టుగా కనిపిస్తుంది.

Telugu Allu Arjun, Bhanu Sri Mehra, Tollywood, Varudu-Movie

ఆమె తన యూట్యూబ్ ఛానల్( YouTube Channel ) లో ట్రావెలింగ్ వీడియోలు ఎక్కువగా పెడుతోంది అలా దేశంలోని అన్ని ప్రాంతాలు తిరుగుతూ సరైన సమాచారం పెడుతూ బాగానే వ్యూస్ సంపాదిస్తోంది ఇక ముందు ముందు సినిమాల్లో ఎవరైనా క్యారెక్టర్ రోల్స్ ఇవ్వకపోతారా అని ఎదురుచూస్తుంది.లేదంటే ఏదైనా రియాలిటీ షోలు అయినా పిలిచి అవకాశం ఇస్తారు అని ఆమె ఆశపడుతోంది.ఇక మరి కొంతమంది అయితే మాత్రం కేవలం తన ఛానల్ కి వ్యూస్ తెచ్చుకోవడం కోసం ఆమె ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంది అని అంటున్నారు.నిజమేంటో తెలియదు కానీ భానుకి మాత్రం అవకాశాలు రావాలని కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube