ఎవరుపడితే వారు 'షావర్మా' అమ్మకూడదు... అలా అమ్మితే శిక్షార్హులు, భారీ జరిమానా?

షావర్మా అంటే ఏమిటో తెలియని కుర్రకారు ఉండదు.నేటి తరానికి అన్నీ కొత్త రుచులు కావాలి.

 Whoever Falls Should Not Sell Shawarma , Shawarma, Kerala Govt,viral Latest, New-TeluguStop.com

ఈమధ్య కాలంలో యువత ఎక్కువగా తింటున్న డిష్ లలో ఈ షావర్మ అనేది ఓ పార్ట్.అందువలనే దీనికి మనదేశంలో మంచి గిరాకీ ఏర్పడింది.

దాదాపు రోడ్డుపక్కన వున్న ఏ రెస్టారెంట్లలోనైనా ఇది ఉండాల్సిందే.అయితే ఇకనుండి ఆ పప్పులు ఉడకవు.అవును… ఇకనుండి షావర్మ అమ్మాలంటే హోటల్స్, రెస్టారెంట్లు లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి.లేదంటే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా వర్తిస్తుంది.

అయితే, ఈ రూల్ మనదగ్గర కాదు.కేరళ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిందీ రూల్.విషయం ఏమంటే, ఇటీవల అక్కడ ఓ 16 ఏళ్ల కుర్రాడు షావర్మా తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయి ప్రాణాలు కోల్పోయాడు.మరికొందరు ఆస్పత్రి పాలై ప్రాణాపాయం నుంచి తృటిలో బయటపడ్డారు.

ఈ ఘటనతో అప్రమత్తమైన కేరళ వైద్య, ఆరోగ్య శాఖ.షావర్మా అమ్మకాలు, తయారీపై కొత్త రూల్స్ రూపొందించింది.ఈ నెల 1 నుంచే ఈ రూల్స్ అక్కడ అమల్లోకి రానున్నాయి.ఇక కొత్త రూల్స్ ప్రకారం.ఎవరైనా షావర్మా తయారు చేసి అమ్మాలంటే ప్రభుత్వ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.

Telugu Safety, Kerala, Licance, Hotels, Shawarma, Latest-Latest News - Telugu

ఒకవేళ అనుమతి లేకుండా షావర్మా విక్రయిస్తే రూ.5 లక్షల వరకు జరిమానాతోపాటు, 6 నెలల వరకు జైలు శిక్ష పడుతుంది.షావర్మా ఎప్పుడు తయారైంది, ఎక్స్‌పైరీ డేట్ అనేది విధిగా వెల్లడించాలి.

అలాగే ఇష్టమొచ్చినట్లు బయట పెట్టి షావర్మా అమ్మడానికి వీల్లేదు.గంట సేపటికంటే ఎక్కువ సమయం షావర్మా బయట ఉంచకూడదు.

మయనైజ్ కూడా రెండు రోజులకు మించి వాడకూడదు. అలాగే నాలుగు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద షావర్మా ఉంచరాదు.

ప్రభుత్వం రూపొందించిన ఫుడ్ సేఫ్టీ రూల్స్ ఫాలో కావాలి.షావర్మా తయారు చేసేందుకు వాడే చికెన్‌ను కనీసం 15 నిమిషాలపాటు ఉడికించాలి.

షావర్మాతోపాటు ఇచ్చే కుబ్బూస్ లేదా బ్రెడ్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి.వీటిలో ఏ రూల్ ఉల్లంఘించినా.

జరిమానా విధిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube