తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో గెలుపెవరిదంటే..?

తెలంగాణ( Telangana ) లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక అందరి చూపు ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలపైనే పడింది.అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బిజెపి,బీఆర్ఎస్ లు లోక్ సభ ఎన్నికల్లో గెలుపు సాధించాలని సర్వశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు.

 Who Won The Telangana Lok Sabha Elections , Telangana, Lok Sabha Elections ,-TeluguStop.com

ఇక ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి.కాబట్టి ఆ రిజల్ట్ పక్కన పెట్టి పార్లమెంట్ ఎన్నికలపై నేతలు అందరూ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని వివిధ సంస్థలు సర్వే చేసినట్లే ఇప్పుడు కూడా కొన్ని సంస్థలు లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని సర్వేలు చేస్తున్నాయి.ఇక అందరూ అనుకున్నట్లే ఈసారి కూడా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ( Congress ) భారీ విజయం సాధించబోతుంది అని తెలుస్తోంది.

Telugu Assembly, Bandi Sanjay, Congress, Lok Sabha, Lokh Sabha, Revanth Reddy, T

కాంగ్రెస్ పార్టీకి 8 నుండి 10 సీట్లు అలాగే ఎమ్ఐ ఎమ్ కి ఒక సీటు బీఆర్ఎస్ ( BRS ) బిజెపికి చేరే మూడు సీట్లు రాబోతున్నట్టు టైమ్స్ నౌ సంస్థ చేసిన సర్వేలో తేలిపోయింది.అయితే క లోక్ సభ ఎన్నికలకు ఇంకో నాలుగు నెలల సమయం ఉంది కాబట్టి ఈ సర్వే ఫలితాలు తారుమారయ్యే ఛాన్స్ ఉంది.ఇక ఈ నాలుగు నెలల్లో బిజెపి నాయకుల పనితీరు అలాగే బీఆర్ఎస్ నాయకుల పనితీరు కూడా ప్రజలు చూస్తారు.అంతేకాకుండా కాంగ్రెస్ ఈ నాలుగునెలల్లో తమ ముందున్న అన్ని పనులను అలాగే వాళ్ళు ప్రకటించిన ఆరు గ్యారెంటీలను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ కి మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది.

Telugu Assembly, Bandi Sanjay, Congress, Lok Sabha, Lokh Sabha, Revanth Reddy, T

ఇక బిజెపి ( BJP ) తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన మాజీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లు ఈసారి ఎంపీ ఎన్నికల్లో గెలుస్తారనే నమ్మకం తో ఉన్నారు.అలాగే కాంగ్రెస్లో ఉన్న ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచి వారి ఎంపీ పదవులకు రాజీనామాలు చేశారు.ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న ఎంపీలు జీరో అని చెప్పుకోవచ్చు.అయితే కాంగ్రెస్ పరిపాలన ఈ నాలుగు నెలల్లో బాగుంటే కచ్చితంగా 8 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరి చూడాలి ఈ నాలుగు నెలల్లో ప్రజలు ఏ పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతారో

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube