తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఖమ్మం ( Khammam ) అంటేనే కాంగ్రెస్ కి కంచుకోటగా పేరు తెచ్చుకుంది.ఇప్పటికే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తా చాటింది.
ఎందుకంటే అక్కడ ఉన్న పది సీట్లలో 9 సీట్లు కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన ఎమ్మెల్యేలు గెలిచారు.ఇక ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చిన సిపిఐ ఎమ్మెల్యేనే గెలిచారు.
దీంతో ఖమ్మం జిల్లా పూర్తిగా కాంగ్రెస్ వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది.ఇక కాంగ్రెస్ ఈసారి అధికారంలోకి రావడానికి కూడా నల్గొండ,ఖమ్మం వంటి స్థానాలే కీలకమయ్యాయి.
ఎందుకంటే నల్గొండ,ఖమ్మం లో ఎక్కువగా కాంగ్రెస్ కి విజయ లభించింది.అంతేకాకుండా రేవంత్ రెడ్డి( Revanth reddy ) మంత్రివర్గంలో కూడా ముగ్గురు ఖమ్మం కి సంబంధించిన వాళ్లే ఉన్నారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అలాగే భట్టి విక్రమార్క కి డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చారు.

అలా కాంగ్రెస్ గెలుపుకు వీళ్ళందరూ కృషి చేశారని చెప్పుకోవచ్చు.అయితే మరి కొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ నుండి ఏడు నుండి పది సీట్లు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే ఖమ్మంలో ఎంపీ సీటు ఆశించే ఆశావాహుల సంఖ్య రోజు రోజు కి పెరుగుతుంది.
అయితే ఖమ్మంలో కాంగ్రెస్ గెలుపునకు తోడ్పడిన వారిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న పొంగులేటి ప్రసాద్ రెడ్డి ( Ponguleti Prasad reddy ) కూడా ఉన్నారు.ఈయన పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతగానో శ్రమించారు.
దాంతో ఈయనకు ఎంపీ సీటు వస్తుందని ఆశతో ఉన్నారు.

అలాగే పొంగులేటి ఫ్యామిలీకి మధిర, సత్తుపల్లి, వైరా,ఖమ్మం నియోజకవర్గాల్లో వీరికి మంచి ఓటు బ్యాంకు ఉంది.అలాగే ప్రజల్లో వీరికి మంచి ఆదరణ కూడా ఉంది.కానీ ఎప్పటినుండో ఖమ్మం ఎంపీ సీటు తనకేనని ఖర్చిఫ్ వేసుకున్నట్టు కూర్చుంది రేణుకా చౌదరి( Renuka Chowdary ) .ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం నుండి సీటు తనకే వస్తుందని రేణుక చౌదరి ధీమా వ్యక్తం చేస్తుంది.ఇక వీళ్లిద్దరే కాకుండా ఇంకో ముగ్గురు నలుగురు నాయకులు కూడా ఖమ్మం ఎంపీ సీటుని ఆశిస్తున్నారు.
దాంతో ఖమ్మంలో ఎంపీ సీటు ఎవరికి ఇవ్వాలో తెలియక కాంగ్రెస్ అధిష్టానం అయోమయంలో పడిపోయిందని తెలుస్తోంది.మరి వీరందరిలో కాంగ్రెస్ (Congress) అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో వేచి చూడాలి.