ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకున్న చిత్రాలలో ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) హీరో గా నటించిన ‘జైలర్’( jailer ).వరుస ఫ్లాప్స్ తో స్లంప్ ఫేస్ లో ఉన్న రజినీకాంత్ కెరీర్ కి మరోసారి ఊపిరి పోసిన చిత్రం ఇది.
కేవలం తెలుగు వెర్షన్ నుండే 50 కోట్ల రూపాయిల షేర్, 90 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇక ఓవర్సీస్ లో అయితే దాదాపుగా 200 కోట్ల రూపాయిలను వసూలు మరోసారి తన సత్తా ఏంటో నేటి తరం ఆడియన్స్ కి చూపించాడు రజినీకాంత్.
ఈ సినిమా రికార్డ్స్ ని ‘లియో’ చిత్రం బద్దలు కొడుతుంది అనుకున్నారు, కానీ అది సాధ్యం కాలేదు.ఇప్పుడు ప్రభాస్ సలార్( Salar ) కచ్చితంగా క్రాస్ చేస్తుంది అనుకున్నారు, కానీ అది కూడా సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ని కొట్టాడు సూపర్ స్టార్.అయితే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రజిని ఎలాంటి సినిమా చెయ్యబోతున్నాడు అని అభిమానులు అనుకుంటున్న సమయం లో ‘లాల్ సలాం’( Lal Salaam ) అనే చిత్రాన్ని ప్రకటించి అందరినీ షాక్ కి గురి చేసాడు.విక్కీ కౌశల్( Vicky Kaushal ) హీరో గా నటిస్తున్న ఈ చిత్రం లో రజినీకాంత్ ఒక ముఖ్య పాత్ర పోషించాడు.అంటే ఉదాహరణకి ఇప్పుడు బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలా అయితే ముఖ్య పాత్ర లో కనిపించాడో, అలా అన్నమాట.
ఈ సినిమాకి రజినీకాంత్ కూతురు ఐశ్వర్య( Aishwarya ) దర్శకత్వం వహించింది.ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతి కానుకగా విడుదల చేద్దాం అని అనుకున్నారు.కానీ సంక్రాంతికి ఈ సినిమా విడుదల అయ్యే ఛాన్స్ లేదని లేటెస్ట్ గా అందుతున్న రిపోర్ట్స్.కారణం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాలేదట.

ఇదే సంక్రాంతికి రజినీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ ( Captain Miller )తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.అల్లుడి సినిమాకి భయపడే మామయ్య వెనకడుగు వేసాడని, లాల్ సలాం చిత్రానికి అసలు హైప్ లేదంటూ ధనుష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.మరో విశేషం ఏమిటంటే ధనుష్ మాజీ భారీ ఐశ్వర్య లాల్ సలాం కి దర్శకురాలు అవ్వడం.
అలా ఒకేసారి మాజీ భార్య, మాజీ మామయ్య అల్లుడి దెబ్బకి పారిపోయారు అంటూ ట్విట్టర్ లో ధనుష్ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.