ర‌న్నింగ్ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వారు మాత్రం అస్స‌లు చేయ‌కూడ‌దు!

ఇటీవ‌ల రోజుల్లో దాదాపు అంద‌రూ ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండ‌టానికి ఇష్ట‌ప‌డుతున్నారు.

ఇందులో భాగంగానే హెల్తీ ఫుడ్ ను డైట్ లో చేర్చుకోవ‌డంతో పాటు రెగ్యుల‌ర్ గా వ్యాయామం చేయ‌డం అల‌వాటు చేసుకుంటున్నారు.

అయితే ఎక్కువ మంది ఇష్ట‌ప‌డే వ్యాయామాల్లో ర‌న్నింగ్( Running ) ముందు వ‌రుస‌లో ఉంటుంది.సులభమైన మరియు ప్రభావవంతమైన వ్యాయామాల్లో ఒకటిగా ర‌న్నింగ్ ప్ర‌సిద్ధి చెందింది.

శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స‌త్తా ర‌న్నింగ్ కు ఉంది.నిత్యం ర‌న్నింగ్ చేయ‌డం వ‌ల్ల బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.

ముఖ్యంగా రన్నింగ్ హృదయ ఆరోగ్యాన్ని పెంచుతుంది.బరువు తగ్గడంలో( Weight Loss ) సహాయపడుతుంది.

Advertisement
Who Should Avoid Running Details, Running, Running Health Benefits, Health, Hea

ఎముక‌ల‌ను, కండరాలను బలపరుస్తుంది.ఎండార్ఫిన్ విడుదల ద్వారా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

ఒత్తిడిని దూరం చేస్తుంది.నిద్ర నాణ్యతను పెంచుతుంది.

మధుమేహం, క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.ఊపిరితిత్తుల పనితీరును పెంచుతుంది.

అయితే ఆరోగ్యానికి మంచిదే అయిన‌ప్ప‌టికీ.కొంద‌రు మాత్రం ర‌న్నింగ్ చేయ‌క‌పోవ‌డ‌మే చాలా ఉత్త‌మం.

Who Should Avoid Running Details, Running, Running Health Benefits, Health, Hea
నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

గుండె జ‌బ్బులు( Heart Problems ) లేదా శ్వాసకోశ సమస్యలు( Respiratory Issues ) ఉన్న వ్యక్తులు త‌మ ఫిట్‌నెస్ రొటీన్‌లో ర‌న్నింగ్ ను చేర్చుకోక‌పోవ‌డ‌మే మంచిది.ఒకవేళ ర‌న్నింగ్ చేయాలి అనుకుంటే క‌చ్చితంగా వైద్యుడి స‌ల‌హా తీసుకోవాలి.వారు మీ ఆరోగ్య ప‌రిస్థితి బ‌ట్టీ ర‌న్నింగ్ చేయాలా.

Advertisement

వ‌ద్దా.అన్న‌ది సూచిస్తారు.

అలాగే కీళ్లనొప్పులు( Knee Pains ) ఉన్న‌వారు రన్నింగ్ చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది.ఎందుకంటే ర‌న్నింగ్ అనేక‌ కీళ్ల నొప్పుల‌ను తీవ్రతరం చేస్తుంది.

గర్భిణీ స్త్రీలు కూడా ర‌న్నింగ్ చేయ‌కూడ‌ద‌ని నిపుణులు సూచిస్తున్నారు.ర‌న్నింగ్ కు బ‌దులుగా వాకింగ్ మ‌రియు ఇత‌ర వ్యాయామాల‌ను ఎంచుకోవ‌డం మంచిద‌ని చెబుతున్నారు.శస్త్ర చికిత్సలు చేయించుకుని.

వాటి నుండి కోలుకుంటున్న వారు ర‌న్నింగ్ చేయ‌కూడ‌దు.పూర్తిగా నయం అయ్యాక డాక్ట‌ర్ స‌ల‌హా తీసుకుని అప్పుడు ర‌న్నింగ్ ను త‌న డైలీ రొటీన్ లో చేర్చుకోవాలి.

తాజా వార్తలు