ఎవరు ఈ హామీదా ఖాతున్ .. ఎవరి కూతురు ?

తెలుగు నాట బిగ్ బాస్ మేనియా నడుస్తోంది.ఎవరి నోట విన్నా బిగ్ బాస్ గురించే చర్చ నడుస్తోంది.ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్-5 మొదలయ్యింది.19 మంది పార్టిసిపెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.ఒక్కో పార్టిసిపెంట్ గురించి నాగార్జు వివరిస్తూ..ఇంట్లోకి తీసుకెళ్లాడు.ఈ లిస్టులో కొంత మంది జనాలకు తెలిసినప్పటికీ.

 Who Is This Hamida Khathun Here Is The Background , Hamida Khatun,  Big Boss, Te-TeluguStop.com

మరికొంత మంది ఎవరో తెలియదు.వారిలో ఒకరు హమీదా ఖాతూను.

ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? ఏం చేసింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

హమీదా ఖాతూన్.

తెలుగు ప్రజలకు బాగా తెలిసిన అమ్మాయే.తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించింది కూడా.

అయినా తనకు అనుకున్న స్థాయిలో ఆమెకు గుర్తింపు రాలేదు.ప్రస్తుతం బిగ్ బాస్ ద్వారా మళ్లీ తన లక్ ను పరీక్షించుకోబోతుంది.

హమీదా.బెంగాళీ అమ్మాయి.1993లో కోల్ కతాలో జన్మించింది.అక్కడే చదువుకుంది కూడా.2013లో హైదరాబాద్ కు వచ్చింది.తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించింది.2015లో సాహసం చేయరా డింభకా అనే సినిమాతో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చింది.అనంతరం భ‌ద్రం బీకేర్ ఫుల్ బ్ర‌ద‌ర్‌ మూవీలోనూ చేసింది.

ఈ రెండు సినిమాలూ తనకు ఏమాత్రం గుర్తింపు ఇవ్వలేదు.టాలెంట్, అందం ఉన్నా తనకు ఛాన్సులు రాలేదు.

వచ్చిన అవకాశాలు కూడా అంతగా కలిసి రాలేదు.

Telugu Bengali, Big Boss, Hamida Khathun, Hamida Khatun, Hyderabad, Interior, Ko

ఇక హమీదా ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.ఆరోగ్యానికి మించిన సంపద మరేదీ లేదని చెప్తుంది.నిజానికి తను ఇంటీరియర్ డిజైనర్ అయినా.

సినిమా రంగంపై మక్కువ ఎక్కువ.ఈ నేపథ్యంలోనే తను బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

బిగ్ బాస్ స్టేజి మీదకు వచ్చిన హమీదపై నాగార్జున ప్రశంసలు కురిపించాడు.ముఖారావిందమే కాదు.

మనసు కూడా అంతకు మించి అందమైనదన్నాడు.ఏది ఏమైనా ఈ షో ద్వారా హమీదా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని.

తన కెరీర్ అద్భుతంగా ముందుకు సాగాలని కోరుకుందాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube