రెండు నెలల క్రితమే అట్టహాసంగా బిగ్ బాస్ ఏడవ సీజన్( Bigg Boss 7 ) ని మొదలు పెట్టారు.మొదట కొంతమందిని రెండో విడతగా మరికొంత మంది ని హౌస్ లోకి పంపించగా ఇప్పటికే అందులోంచి కొంతమంది ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చారు.
ఇక నెలరోజులకు పైగా ఆటం మిగిలి ఉంది వీక్ కంటెస్టెంట్స్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు స్ట్రాంగ్ కంటెస్టెంట్ మరింత స్ట్రాంగ్ అవుతున్నారు ఉల్టా పుల్టా అని పేరు పెట్టుకున్నారు కాబట్టి వింత వింత ఆటలు ఆడిస్తూ వింత రకమైన ఎలిమినేషన్స్, నామినేషన్స్ జరిపిస్తూ, తిరిగి మళ్ళీ హౌస్ మేట్స్ని కన్ఫ్యూజన్ లో పెడుతూ, ఎలిమినేట్ అయిన వారిని కూడా హౌస్ కి తీసుకొస్తూ రకరకాల కుప్పిగంతులు వేస్తూ ఆట కొనసాగుతోంది.

సరే టీఆర్పి కోసం బిగ్ బాస్ యాజమాన్యం ఏదోలా తిప్పలు పడుతుందిలే అనుకుంటే కొంతమంది హౌస్ లో ఎలాంటి ఆటను సరిగా ఆడకుండా వీక్ కంటెస్టెంట్ గానే ఉండిపోతున్నారు.ఏదో ఒక తప్పు చేయడం లేదా ఆడకుండా ఊరుకోవడం అది కాదంటే పక్క వాళ్ళ ఆటను ప్రభావితం చేయడం వంటివి చేస్తూ వారాంతంలో నాగార్జునతో( Nagarjuna ) తిట్లు పడుతూ ఉంటారు.ఇంతకీ ఈ పురాణం అంతా ఎవరి గురించి అనుకుంటున్నారా ఆ కంటెస్టెంట్ మరెవరో కాదండి వైల్డ్ కార్డు ఎంట్రీగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ఇప్పటివరకు ఒక్క ఆట కూడా సరిగా ఆడని అశ్విని( Ashwini ).

ఈమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు పోనీ ఆట ఎలా ఆడుతుందో అంటే అది కూడా తెలియదు ఆడితే బజర్ కొట్టదు, ఆడకుండా గొడవ పడుతుంది.ఎలాగూ దృష్టి లేదు అనుకుంటే ఈ మధ్యలో గౌతమ్( Gautham ) పై తన ప్రభావితం చూపించి అతని ఆట తీరును చెడగొట్టే ప్రయత్నం కూడా చేసింది చెప్పుడు మాటలు చెబుతూ అందరిపై ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది ఇదే రకంగా ఆడితే అతి త్వరలో అశ్విని ఇంటి ముఖం పట్టడం కాయం ఇప్పటికే హౌస్ లో నెగెటివిటీ ఉన్న వారిని ఎలా పంపించాలో అర్థం కాక అందరూ కొట్టుకుంటుంటే ఈ అశ్విని మాత్రం సైలెంట్ గా ఆడకుండా పక్కవారిని బయటకు పంపిస్తోంది.