Shankar Nag : తెలుగు లో చిరు, తమిళ్ లో రజినీ, మలయాళంలో మోహన్ లాల్..మరి కన్నడ లో ఎవరు స్టార్ ?

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywood )ని ఒంటి చేత్తో ఏలాడు చిరంజీవి.చిరు మెగాస్టార్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకెళ్లాడు.

 Who Is The Super Star In Kannadq-TeluguStop.com

ఇక తమిళం లో రజనీకాంత్ తనదైన నటనతో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ సూపర్ స్టార్ గా మారాడు.మలయాళంలో మోహన్ లాల్( Mohanlal ) చిరంజీవి తెలుగులో ఎలా మెగాస్టార్ అయ్యాడు అలా మెగాస్టార్ గా నిలిచాడు.

మరి కన్నడం లో ఎవరు సూపర్ స్టార్ అనేది చాలామందికి తెలుసుండదు.కన్నడ ఇండస్ట్రీలో శంకర్ నాగ్ అప్పట్లో ఒక ఊపు ఊపాడు.నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు, నిర్మాతగా కన్నడ-భాషా సినిమాలు, టీవీ షోలలో శంకర్ నాగ్ పని చేశాడు.1990లో చనిపోయినా ఇతడిని కన్నడ ప్రేక్షకులు ఇప్పటికే గుర్తు తెచ్చుకుంటారు.


Telugu Bangalore, Chiranjeevi, Kannada, Shankar Nag-Movie

అంటే అతను ప్రేక్షకులపై ఎంత ప్రభావం చూపాడో అర్థం చేసుకోవచ్చు.ముఖ్యంగా బెంగళూరు ప్రజలు( Bangalore ) అతడి పేరును తలుచుకోని రోజు ఉండదు.ఈ సిటీలో లెక్కలేనన్ని ఆటో రిక్షాలపై శంకర్ నాగ్ బొమ్మ కనిపిస్తుంది.చాలా ఏరియాలలో శంకర్ నాగ్( Shankar Nag ) విగ్రహం దర్శనమిస్తుంది.శంకర్ నాగ్ సోదరుడు అనంత్ నాగ్ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నాడు.కెజిఎఫ్ సినిమాలో అనంత్ నాగ్ ఒక కీలక రోల్ పోషించాడు.

న్యూస్ రిపోర్టర్‌గా రాఖీ బాయ్ స్టోరీ చెప్పే ఒక వేషం వేశాడు.ఇక శంకర్ నాగ్‌ గిర్నీష్ కర్నాడ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఒందనోందు కాల దల్లి (1978)’ కన్నడ సినిమాతో తెరంగేట్రం చేశాడు.

ఈ సినిమా సూపర్ హిట్ అయింది.ఈ మూవీ తోనే కరాటే కింగ్ అనే బిరుదును శంకర్నాథ్ సంపాదించాడు.1988లో వచ్చిన ఎస్‌పీ సంఘలియానా అనే సినిమా కూడా కర్ణాటక రాష్ట్రంలో సూపర్ డూపర్ హిట్ అయింది ఈ మూవీతో శంకర్ నాగ్‌ క్రేజ్ మరో లెవల్ కి వెళ్ళింది.

నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తన సత్తా చాటాడు.

పూరి జగన్నాథ్ పోకిరి సినిమాని శంకర్ నాగ్ తీసిన ఓ సినిమా నుంచే ఇన్‌స్పిరేషన్ తీసుకొని డైరెక్ట్ చేశాడు.శంకర్ నాగ్ ఆ సినిమాను రాజ్ కుమార్ ను కథానాయకుడిగా పెట్టి “ఒందు ముత్తిన కథే” పేరుతో ఈ తీశాడు.

తొలిసారిగా వాటర్ ఫ్రూఫ్ కెమెరా వాడి హాలివుడ్ లెవెల్లో ఈ మూవీ తీసి ఔరా అనిపించాడు ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ కాలేదు కానీ ఇందులోని టెక్నికల్ యస్‌పెక్ట్‌గా చాలామందిని ఆకట్టుకుంది తర్వాత ఇది కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది.


Telugu Bangalore, Chiranjeevi, Kannada, Shankar Nag-Movie

బెంగళూరులోని నమ్మ మెట్రో, నంది హిల్స్‌ను ముందుగానే గుర్తించి, ఆ సంగతి ప్రభుత్వంతో మాట్లాడి వాటికి పునాది వేయించిన ఘనత కూడా శంకర్ నాగ్‌ సొంతం.ఇక కారు ఢీకొన్న ప్రమాదంలో నాగ్ మరణించాడు.దావణగెరె పట్టణం శివార్లలోని అనగోడు విలేజ్ వద్ద జోకుమారస్వామి మూవీ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కోసం వెళ్తున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది.

లేదంటే కన్నడ ఇండస్ట్రీకి కూడా ఒక మెగాస్టార్ ఉన్నాడన్న సంగతి అందరికీ తెలిసేది.చనిపోయిన ఈ వీరుడు మాత్రం ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ బతికే ఉంటాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube