అల్లు అర్జున్ ( Allu Arjun ) కి నేషనల్ అవార్డు వస్తుందని ఆ హీరోయిన్ ముందుగానే పసిగట్టింది అనే సంగతి మీకు తెలుసా అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.మరి అల్లు అర్జున్ కి వచ్చే అవార్డుని ముందుగానే ఊహించిన ఆ హీరోయిన్ ఎవరు? ఆమె పేరేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పుష్ప ( Pushpa ) సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ చూస్తే ఎవరైనా సరే అల్లు అర్జున్ కి కచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిందే అంటారు.ఇక పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ ఎంతలా ఒదిగిపోయారంటే ఆ సినిమా కోసం ఆయన ఎంతగానో కష్టపడ్డారట.అంతేకాదు ఆ గడ్డం, జుట్టుతో చాలా రోజులు ఇబ్బంది పడ్డారు.
అయినప్పటికీ సినిమా అంటే అన్ని భరించాలి అనే ఉద్దేశంతో అల్లు అర్జున్ తన షూటింగ్ కంప్లీట్ చేశారు.అయితే ఈ సినిమాలోని తన యాక్టింగ్ చూసి ఫిదా అయినా చాలామంది కచ్చితంగా అల్లు అర్జున్ కి అవార్డులు రావడం ఖాయం అని అంటూ ఉంటారు.
అయితే ఓ హీరోయిన్ మాత్రం కచ్చితంగా మీకు నేషనల్ అవార్డు ( National Award ) వస్తుంది అని ముందే చెప్పేసిందట.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మందన్న.
అవును రష్మిక మందన్న అల్లు అర్జున్ కి అవార్డు వస్తుందని ముందుగానే పసిగట్టిందట.
ఈమె పుష్ప సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ నటనకి ఆయన డెడికేషన్ కి కచ్చితంగా ప్రతి ఒక్కరు ఫిదా అవుతారు.ఇక అల్లు అర్జున్ మేకప్ వేసుకోవడానికి మూడు గంటల సమయం పట్టింది.అందులో తన యాక్టింగ్ తో, డైలాగులతో ఇరగదీసారు.
అల్లు అర్జున్ యాక్టింగ్ తో పుష్ప సినిమా మరో లెవల్ కి వెళ్ళింది.ఇక ఖచ్చితంగా అల్లు అర్జున్ యాక్టింగ్ కి నేషనల్ అవార్డు రావడం ఖాయం.
నేషనల్ అవార్డు మాత్రమే కాదు ఏ అవార్డు అయినా సరే అల్లు అర్జున్ గారికి వస్తుంది.ఒకవేళ అవార్డు రాకపోతే ముందుగా నేనే హర్ట్ అవుతాను అంటూ రష్మిక మందన్న ( Rashmika Mandanna ) అప్పుడు మాట్లాడిన వీడియో ప్రస్తుతం బన్నీకి నేషనల్ అవార్డు వచ్చాక వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ కి అవార్డు వస్తుందనే విషయాన్ని రష్మిక మందన్న ముందే ఊహించింది అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy